భారతదేశంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకే భార్య.. ఒకే భర్త అన్న సాంప్రదాయం ఉంది. ఇక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాక చచ్చేంత వరకు కలిసి ఉండాలి. ఇదే పద్ధతి దేశంలో కొనసాగుతోంది. కానీ నేటి ఆధునిక యుగంలో ఆ బంధానికి విలువ లేకుండా పోయింది. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కి… కట్టుకున్న వాళ్లతో బంధాలు తెంచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఒక ఇల్లాలు.. ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆశిష్ తివారీ-పింకీ భార్యాభర్తలు. 2016లో వీరికి వివాహం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 7, 4 ఏళ్ల ఇద్దరు కుమారులున్నారు. కుటుంబం సాఫీగా సాగిపోతుంది. ఈ క్రమంలో పింకీ అడ్డదారులు తొక్కింది. అమిత్ శర్మ అనే యువకుడితో ఎఫైర్ నడిపింది. అయితే గత శనివారం పింకీ-అమిత్ శర్మ ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆశిష్ తివారీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రప్పించాడు. దీంతో ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు రాజీ చేసి భర్తతో వెళ్లిపోవాలని పింకీకి కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ పింకీ మాత్రం భర్తతో వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. ప్రియుడు అమిత్ శర్మతోనే ఉంటానని తెగేసి చెప్పింది. పోలీసులు ఎంత నచ్చ జెప్పినా మాట వినలేదు. ప్రియుడితోనే జీవిస్తానని చెప్పింది. ఇలా రోజంతా పంచాయితీ చేసినా ఏ మాత్రం పింకీ వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇక పిల్లలు తల్లితో వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టం చూపలేదు. తమ తండ్రితోనే ఉంటామని పిల్లలిద్దరూ తెగేసి చెప్పారు.
ఇక చేసేదేమీలేక ఆశిష్ తివారీ…అమర్‌గఢ్‌లోని పురాతన శివాలయంలో ప్రియుడు అమిత్ శర్మకు పింకీని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇరువైపుల నుంచి బంధువులు హాజరయ్యారు. అమిత్ శర్మ దిలీప్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీసిద్దిపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన సమీప ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.
