Site icon NTV Telugu

UP: భార్యతో గొడవ, నదిలోకి దూకి భర్త ఆత్మహత్య..

Up News

Up News

UP: భార్యాభర్తల మధ్య వాగ్వాదం భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌ రాజధాని లక్నోలో జరిగింది. శుక్రవారం రాత్రి భార్యతో గొడవ తర్వాత, 37 ఏళ్ల అనుపమ్ తివారీ నదిలో దూకినట్లు తెలుస్తోంది. అతడిని కాపాడే క్రమంలో బంధువైన 20 ఏళ్ల శివం ఉపాధ్యాయ్ కూడా మృతి చెందాడు. 12 గంటల తర్వాత శివం డెడ్‌బాడీని వెలికి తీశారు.

Read Also: Bhairavam: వారికి గ్యాప్ వచ్చింది.. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం కష్టమని అనుకున్నా!

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసేందుకు డైవర్లను ఏర్పాటు చేశారు. అయితే, పురోగతి కనిపించకపోవడంతో ఎస్డీఆర్ఎఫ్ ని రంగంలోకి దించారు. 12 గంటలు తీవ్రంగా శ్రమించిన తర్వాత ఒకరి మృతదేహాన్ని మాత్రమే కనుగొన్నారు. అనుపమ్ తివారీ తరుచుగా భోజనం తర్వాత నడకక కోసం ఇక్కడకు వచ్చే వాడని, నిన్న రాత్రి కూడా ఇదే జరిగిందని, తను కాలు జారి నదిలో పడినట్లు అతడి స్నేహితుడు దేవమణి మిశ్రా చెప్పారు. అయితే, అనుపమ్ బంధువు దేవేష్ ద్వివేది మాత్రం, నదిలోకి దూకినట్లు వెల్లడించారు.

Exit mobile version