NTV Telugu Site icon

Jharkhand: శృంగారం చేస్తూ దొరికిపోయిన భార్య, ప్రియుడు.. తల నరికేసిన భర్త

Crime News

Crime News

Husband chops off wife’s lover’s head after catching them together: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని దారుణంగా హత్య చేశాడు భర్త. తన భార్యతో కలిసి అభ్యంతరకర స్థితిలో ఉన్న ప్రియుడిని చూసిన భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో కోపంతో ప్రియుడిని అంతం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ లోని లోంజో గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లోంజో గ్రామానికి చెందిన విశ్వనాథ్ సుండి అనే వ్యక్తి తన భార్య ప్రేమికుడితో కలిసి ఉండటాన్ని చూసి గొడ్డలిగో తలను నరికేశాడు.

Read Also: COVID 19: చైనాలో కోవిడ్ కల్లోలం.. ఒక్క నెలలో 60 వేల మరణాలు..

సైగైసాయి గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్ హెంబ్రామ్ అనే యువకుడితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు విశ్వనాథ్ సుండి అనుమానం పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి భార్యను కలవడానికి లోంజో గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో శ్యామ్ లాల్, సుండి భార్యతో కలిసి ఉండటం, అదే సమయంలో ఇద్దరు శృంగారంలో మునిగి తేలుతుండటం చూసి కోపోద్రిక్తుడు అయిన సుండి శ్యామ్ లాల్ తలను గొడ్డలితో నరికాడు. భార్యను తీవ్రంగా కొట్టిన సుండి, ఆ తరువాత శ్యామ్ లాల్ ను ఈడ్చుకెళ్లి చెట్లుకు కట్టేశాడు. గొడ్డలిని తీసుకువచ్చి తలను నరికాడు. దీంతో శ్యామ్ లాల్ అక్కడికక్కడే మరణించాడు.

సోనువా పోలీసులు శనివారం ఉదయం లోంజో గ్రామానికి చేరుకుని విశ్వనాథ్ సుండిని అరెస్ట్ చేశారు. శ్యామ్ లాల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. తల నరికిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు కింద కేసు నమోదు చేశారు.

Show comments