NTV Telugu Site icon

Amritpal Singh Case: ఐదో రోజు అమృత్‌పాల్ సింగ్ కోసం వేట.. ఇండో-నేపాల్ బోర్డర్‌లో హై అలర్ట్..

Amritpal Singh

Amritpal Singh

Amritpal Singh Case: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం ఐదో రోజు వేట కొనసాగుతోంది. పంజాబ్ తో పాటు చుట్టుపక్కట రాష్టాల్లో కూడా ఆయన కోసం పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండో-నేపాల్ బోర్డర్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఈ మార్గం గుండా నేపాల్ కు పారిపోయే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్, ఇండియా సరిహద్దు రాష్ట్రం అయిన ఉత్తరాఖండ్ పోలీసులు విస్తృతం సోదాలు నిర్వహిస్తున్నారు. ఉధమ్ సింగ్ నరగ్ లోని అన్ని గురుద్వారాలను, హోటళ్లను తనిఖీ చేశారు. సరిహద్దులో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు.

Read Also: Pastor arrested: యువతులపై లైంగిక వేధింపులు.. పాస్టర్‌ భాగోతం బయటపెట్టిన బాధితులు

ఇదిలా ఉంటే అతను మారువేషంలో తప్పించుకునే అవకాశం ఉండటంతో ఈ మేరకు ఆయన ఏడు ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. క్లీన్ షేవ్, గడ్డం లేకుండా పోలీసులు ఆయన ఎలా ఉంటారనే దానిపై చిత్రాలను విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన అనుచరులను అరెస్ట్ చేసి అస్సాంకు తరలించారు. ఆదివారం అరెస్టు చేసిన నలుగురు సభ్యులను అస్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు తరలించారు. అతని సహాయకులను విచారించేందుకు పంజాబ్ పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండాతో అమృత్ పాల్ సింగ్ సంబంధాలు కలిగి ఉన్నారని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. అమృత్ పాల్ సింగ్ బైక్ పై పారిపోయేందుకు సహకరించిన వ్యక్తికి పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉన్న పప్పల్ ప్రీత్ గా గుర్తించారు.

Show comments