Human sacrifice of two young women in Kerala: డబ్బుకు ఆశపడిన ఓ దంపతులు దారుణానికి తెగబడ్డారు. ఏకంగా ఇద్దరు యువతులను దారుణంగా నరబలి ఇచ్చారు. కేరళలోని పతనంతిట్ట జిల్లా తిరువల్లకు చెందిని నిందితులు భగవల్ సింగ్ అతని భార్య లైలాలు డబ్బు ఆశకోసం ఇద్దరని దారుణంగా హత్య చేశారు. వీరిద్దరికి రషీద్ అలియాస్ మహ్మద్ షఫీ సహకరించారు. ముగ్గురు కలిసి ఇద్దరు యువతులను నరబలి ఇచ్చారు. 50 ఏళ్లుగా లాటరీ టికెట్లు అమ్ముకుంటున్న ఇద్దరు మహిళలను వీరు టార్గెట్ చేశారు. వీరిద్దరు కేరళలోని కడవంతర, కాలడి నివాసితులు. వీరిలో ఒకరు ఈ ఏడాది జూన్ లో కనిపించకుండాపోగా.. మరో మహిళ సెప్టెంబర్ నుంచి అదృశ్యం అయింది.
వీరిద్దరిని గొంతు కోసి, శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేసి నరికి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు భగవల్ సింగ్, లైలా తిరువల్ల నివాసితులు కాగా.. షఫీ పెరుంబవూర్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు భగవల్ సింగ్ దంపతుల ఇంటికి హత్యగావించబడ్డ యువతులను షఫీనే తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: Ram Setu Trailer: శ్రీ రాముడిపై నమ్మకానికి సవాల్..
మధ్యప్రదేశ్‌లో ఇద్దరి దారుణహత్య.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాలోని దారుణం జరిగింది. 18 ఏళ్ల యువకుడిని, 16 ఏళ్ల బాలికను పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు మంగళవారం పోలీసులు వెల్లడించారు. సోమవారం జిల్లాలోని పాఠశాలకు వెళ్లే మార్గంలో విద్యార్థులు ఇద్దరి శవాలను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. హత్యకు గత కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు గ్రామస్తులు, ఇద్దరి కుటుంబీకులను విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో బాలుడు, బాలిక మెడపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గుర్తులు ఉన్నాయి. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. నేరం జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.