Ram Setu Trailer: శ్రీ రాముడిపై నమ్మకానికి సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Setu Trailer:ప్రస్తుతం బాలీవుడ్ ఆశలన్నీ రామ్ సేతుపైనే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరో అక్షయ్ కుమార్, జాక్వలిన్ పెర్నాండజ్ జంటగా అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం రామ్ సేతు. కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ అబుడాంటియా ఎంటర్ టైన్ మెంట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. “ఈ దేశం శ్రీ రాముడిపై నమ్మకంతో నడుస్తోంది..” అంటూ నాజర్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. కొన్నేళ్ల క్రితం రామ్ సేతును కూల్చడానికి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఇక ఆ ఘటనను కూడా ఇందులో చూపించారు.
ఇక శ్రీరాముడిపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడానికి నాజర్ బృందం ఆర్కియాలజిస్ట్ అక్షయ్ కుమార్ ను రంగంలోకి దించుతారు. అయితే ఆ మెషిన్ ఏంటి..? దానివెనుక ఎవరు ఉన్నారు అనేది తెలియని అక్షయ్ టీమ్ వారు చెప్పింది చేయడానికి బయల్దేరతారు. ఇక మధ్యలో వారికి తెల్సిన నిజాలు ఏంటి..? రామ్ సేతును నాశనం చేయడానికి పూనుకున్నది ఎవరు..? దానివలన వారికి కలిగే లాభం ఏంటి అనేది సినిమా కథగా తెలుస్తోంది. ఆర్కియాలజిస్ట్ గా అక్షయ్ తన పాత్రలో లీనమైపోయాడు. అతడికి తోడుగా జాక్వలిన్, సత్యదేవ్ కనిపించారు. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో దీపావళీ కానుకగా రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..