NTV Telugu Site icon

Nigerians Attack: ఢిల్లీ పోలీసులపై నైజీరియన్ల దాడి..

Delhi Cops

Delhi Cops

Huge Mob Attacks Delhi Cops After 3 Nigerians Detained: ఢిల్లీ పోలీసులపై నైజీరియన్ దేశస్తులు దాడి చేశారు. అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో సమారు 100కు పైగా వ్యక్తులు పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. పోలీసులను చుట్టుముట్టి ముగ్గుర్ని విడిపించే ప్రయత్నం చేశారు. పోలీసులపై వాగ్వాదానికి దిగి దాడి చేసే ప్రయత్నం చేశారు. యాంటీ డ్రగ్స్ ఫోర్స్ పోలీసులు వీసా గడువు ముగియడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్స్ సెల్ టీం శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నెబ్ సరాయ్ లోని రాజు పార్క్ కు వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకుంది.

Read Also: Bhadrachalam Temple: భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూలు.. భక్తులు ఆగ్రహం

ఈ అరెస్టు చోటు చేసుకున్న తర్వాత 100 మందికి పైగా ఆఫ్రికన్ల గుంపు పోలీస్ ఆపరేషన్ ను అడ్డుకుంది. ఈ గందరగోళం సమయంలో ముగ్గురు నిందితుల్లో ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇందులో 22 ఏళ్ల ఫిలిప్ అనే వ్యక్తిని పట్టుకోగలిగారు. పట్టుకున్న వ్యక్తులను దేశ బహిష్కరణ చేయాలని పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మొత్తం ఈ ఘటనను స్థానికంగా ఉన్నవారు వీడియో తీశారు. తాడుతో బారికేడ్ ఏర్పాటు చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు పోలీసులు. నెబ్ సరాయ్ పోలీస్ స్టేషన్ మరియు నార్కెటిక్ స్వ్కాడ్ జాయింట్ టీమ్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు రాజు పార్క్ లో మరో మహిళతో సహా నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ జరుగుతున్న సమయంలో 150-200 మంది పోలీసు టీములను చుట్టుముట్టారని.. నిందితులను విడిపించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు.