Site icon NTV Telugu

Mumbai: ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత.. 8 మంది స్మగ్లర్లు అరెస్ట్

Mumbai

Mumbai

ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.39 కోట్ల విలువ చేసే 39 కేజీల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబైకు తరలిస్తుండగా స్మగ్లింగ్ ముఠాను అధికారులు వల పన్ని పట్టుకున్నారు. 8 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: India-China: ముమ్మాటికీ అరుణాచల్‌ మాదే.. చైనా వ్యాఖ్యల్ని ఖండించిన భారత్

కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించేందుకు స్మగ్లర్లు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం రాకుండా చాక్లెట్స్ రూపంలో ప్యాకెట్స్‌లో దాచిపెట్టి కేటుగాళ్లు తరలిస్తున్నారు. అయితే స్మగ్లర్ల ఎత్తులను కస్టమ్స్ అధికారులు చిత్తు చేశారు. దీంతో విదేశీ గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టైంది. 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బ్యాంకాక్ నుంచి భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. దీంతో బ్యాంకాక్ నుంచి భారత్‌కు వచ్చే ప్రతి ప్రయాణికుడిపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Realme Watch 5: త్వరలో భారత మార్కెట్‌లోకి రియల్‌మీ కొత్త స్మార్ట్ వాచ్..

Exit mobile version