Asaduddin Owaisi: బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై AIMIM పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీల రక్షణతో పాటు ప్రాంతీయ స్థిరత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఇక, బంగ్లాదేశ్‌లో దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ హత్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు. ఈ విషయంలో భారత్-బంగ్లాదేశ్ అర్థవంతమైన చర్చలు కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఎంఐఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. అలాగే, బంగ్లాదేశ్ సెక్యులర్, బంగ్లా జాతీయవాద పునాదులపై ఏర్పడిన దేశం, అక్కడ సుమారు 2 కోట్ల మంది ముస్లిమేతర మైనారిటీలు నివసిస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు.
Read Also: Coconut Dosa: దూదిలాంటి మెత్తని ‘కొబ్బరి దోశ’.. లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్!
ఇక, భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరగకూడదని ఆకాంక్షిస్తున్నాను.. అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉండాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ మైనారిటీల భద్రతకు కట్టుబడి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో శాంతి అత్యంత అవసరం, ముఖ్యంగా భారత్ లోని ఈశాన్య రాష్ట్రల భద్రతకు అది కీలకం అన్నారు. అయితే, ఐఎస్ఐ, చైనా వంటి దేశాలు భారత్‌కు శత్రుత్వం ఉండటం ఆందోళన కలిగిస్తోందని హెచ్చరించారు. అదే సమయంలో భారత్‌లో కూడా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు.
