Site icon NTV Telugu

2000 Note Withdraw: 2 వేల నోటుని ఎలా మార్చుకోవాలి?

How To Exchange 2000

How To Exchange 2000

How To Change 2000 Note In Banks: రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. రూ.2 వేల నోట్లను సర్క్యులేషన్‌లో ఉంచొద్దని బ్యాంకులకు ఆదేశం ఇచ్చిన ఆర్బీఐ.. సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ.2 వేల నోటుని మార్చుకోవచ్చుని ఆర్బీఐ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ నోట్లను ఎలా మార్చుకోవాలనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. అయితే.. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నోట్లను మార్చుకోవడానికి ఒక సింపుల్ పరిష్కారం ఉంది.

Rs. 2000 Notes withdrawn: రూ.2000 నోటు రద్దు.. రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం..

మన వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను దగ్గరలో ఉన్న బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. అందుకు ఆ బ్యాంక్ వాళ్లు మనకు రూ. 500, రూ.100 నోట్ల కింద తిరిగి చెల్లిస్తారు. అలా కాకుండా మనం మన బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసినా సరిపోతుంది. అయితే.. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో విడతలో, అంతే రోజుకి రూ.20 వేలు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే.. 10 రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి వీలు ఉంటుంది. సెప్టెంబర్ 30 దాకా మార్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, ఆందోళన చెందకుండా ఆలోపు వీలున్నప్పుడు నోట్లను మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు బ్యాంక్ ఖాతా లేకపోతే.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి, అక్కడ రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు.

Kakani Govardhan Reddy: చంద్రబాబుకి తన కొడుకు లోకేష్ కూడా మోసం చేస్తాడనే అనుమానం ఉంది

ఇదిలావుండగా.. ఆర్‌బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం, 2016 నవంబర్ నెలలో రూ.2000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత.. దేశీయ కరెన్సీ అవసరాల్ని తీర్చేందుకు ఈ రూ.2 వేల నోటుని తీసుకొచ్చారు. అనంతరం.. సరిపడా ఇతర కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాక, రూ. 2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ 2018-19లో నిలిపివేసింది. 2018 మార్చి 31 నాటికి చలామణిలో గరిష్ఠంగా 37.3 శాతం రూ.2 వేల నోట్లు ఉండగా.. 2023 మార్చి 31 నాటికి 10.8 శాతానికి పడిపోయింది.

Exit mobile version