NTV Telugu Site icon

Sniffer Dog: నువ్వు కుక్కవి కాదు ‘లియో’వి.. తప్పిపోయిన చిన్నారిని 3 గంటల్లోనే కనుగొంది..

Sniffer Dog

Sniffer Dog

Sniffer Dog: ప్రస్తుతం ఆర్మీతో పాటు ఇతర భద్రతా బలగాల్లో జాగిలాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారానే చాలా వరకు ఆపరేషన్లను మన భద్రతా బలగాలు విజయవంతంగా పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదుల వేటకు స్నిఫర్ డాగ్స్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ముంబైలో తప్పిపోయిన పిల్లాడిని కేవలం 3 గంటల్లోనే కనుగొంది. “లియో” పేరు కలిగిన స్నిఫర్ డాగ్ అతడిని గుర్తించింది.

Read Also: Kia Sonet facelift: కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది..లాంచ్ వివరాలు ఇవే..

గత వారం నవంబర్ 23న ముంబై శివారు ప్రాంతమైన పోవైలోని అశోక్ నగర్ మురికివాడలో తన స్నేహితులతో ఆడుకుంటున్న 6 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. కుటుంబీకులు చాలా ప్రాంతాల్లో వెతికినప్పటికీ పిల్లాడిని కనుగొనలేకపోయారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు లియోని రంగంలోకి దించారు. రంగంలోకి దిగిన కొద్ది గంటల్లోనే పిల్లాడిని కనిపెట్టింది.

ఈ మురికివాడలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పిల్లాడు ఎక్కడ తప్పిపోయిందో, ఎటు వెళ్లిందనే వివరాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. అయితే ఆపరేషన్‌లో భాగంగా స్నిఫర్ డాగ్ లియో చిన్నారి టీషర్ట్ వాసన ఆధారంగా వెతకడం ప్రారంభించింది. పోలీసులు ముందుగా లియోను బాలుడి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న బహిరంగ ప్రదేశంలో మాత్రమే ట్రాక్ చేయవచ్చు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని అంబేద్కర్ ఉద్యాన, అశోక్ టవర్ ప్రాంతంలో గుర్తించారు. నిందితులను గుర్తించడానికి పోలీసులు స్థానిక నిఘా, ఇతర సాంకేతిక మార్గాలను ఉపయోగిస్తున్నారు.

Show comments