కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భారీ నష్టాన్ని మిగిల్చాయి.. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ విరుచుకుపడుతోంది.. ఈ సమయంలో.. కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది ప్రభుత్వం.. ఇక, బూస్టర్ డోసును కూడా ప్రారంభించింది.. మొదటగా ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు.. 60 ఏల్లు పైబడినవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.. ఇదే సమయంలో.. అసలు బూస్టర్ డోసు ప్రభావం ఎంత? అనే చర్చ కూడా సాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ల ప్రభావంపై దేశీయంగా అధ్యయనం జరగకపోయినా, ఇతర దేశాల్లో జరిగిన దాని ప్రకారం బూస్టర్‌డోసుతో 85 శాతం వరకు రక్షణ ఉంటుందని చెబుతున్నారు.. సీఎంసీ ప్రొఫెసర్ గగన్‌దీప్ కాంగ్.. ఇక, ఇప్పటికే దేశంలో థర్డ్ వేవ్ మొదలైంది.. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారానికి రికార్డుస్థాయిలో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.. వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
రెండు నుంచి నాలుగు వారాల్లో ఒమిక్రాన్ కేసులు పెరగడం.. ఒమిక్రాన్ సోకి ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరగడం.. ఇదే సమయంలో మరణాలు కూడా ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు గగన్‌దీప్ కాంగ్. ప్రపంచంలో పర్యవేక్షణ, నిఘా చాలా తక్కువగా ఉన్నచోట్ల వైరస్ విస్తరించి ఒమిక్రాన్‌కు దారి తీసిందన్న ఆమె.. ఒమిక్రాన్‌ను నిరోధించడానికి ఇప్పటి వరకు తీసుకుంటున్న జాగ్రత్తలే మళ్లీ పాటించాలన్నారు.. తక్కువ రిస్క్ ఉన్న చోట గుడ్డ మాస్కులు కాకుండా సర్జికల్ మాస్కులు, ఎక్కువ రిస్కు ఉన్న చోట ఎన్-95 మాస్కులు వినియోగించాలి.. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది.. కానీ , దీని బారిన పడిన వారు ఎక్కువ ప్రమాదంలోకి వెళ్లరు.. అయితే, ఎక్కువమందికి సోకినప్పుడు ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు..
