NTV Telugu Site icon

Isro: శక్తివంతమైన “సౌర తుఫాను” నుంచి ఇస్రో మన శాటిలైట్లను ఎలా రక్షించింది..?

Soral Strorm

Soral Strorm

Isro: ఇటీవల సూర్యుడి నుంచి వెలువడని కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CMEs) వల్ల శక్తివంతమైన సౌర తుఫాను ఏర్పడింది. ఇది భూమిపై ‘భూఅయస్కాంత తుఫాను’ను ప్రేరేపించింది. గత దశాబ్ధాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ సౌర తుఫాను తీవ్రత ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ తుఫాను ధాటికి శాటిలైట్లతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ గ్రిడ్స్‌కి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్‌కి చెందిన ‘‘స్టార్‌లింక్’’ శాటిలైట్లు కూడా ఈ సౌర తుఫాను ధాటికి ఒత్తిడికి గురయ్యాయని, సేవల్లో క్షీణత ఎదుర్కొన్నట్లు సంస్థ పేర్కొంది.

మే 8, 9న రెండు దశాబ్ధాల తర్వాత వచ్చిన బలమైన సౌర తుఫాను నుంచి భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) తన శాటిలైన్లను సురక్షితంగా రక్షించింది. భూమినే కాకుండా చంద్రుడిని కూడా ఈ సౌర తుఫాను తాకింది. భూమి, చంద్రుడి చుట్టూ భారతదేశానికి చెందిన మొత్తం 50కి పైగా శాటిలైట్లు ఉన్నాయి. సూర్యుడిపై కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల భారీగా ప్మాస్లా సౌరవ్యవస్థలోకి వెదజల్లబడింది. ఇది ఉపగ్రహాలను ప్రమాదంలో పడేశాయి.

Read Also: Attack On Man: వాయిదాలు మిస్సయినందుకు వ్యక్తి పై దాడి చేసిన ఫైనాన్స్ కంపెనీ లోన్ ఏజెంట్..

ప్రస్తుతం సూర్యడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్‌లో భాగంగా గరిష్ట స్థితికి చేరుకున్నారు. ఈ సౌరచక్రంలో సూర్యుడి మాగ్నెటిక్ పోల్స్ రివర్స్ అవుతాయి. ఆ సమయంలో సూర్యుడి చాలా క్రియాశీలకంగా ఉంటాడు. దీంతో సూర్యడి నుంచి సౌరజ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సోలార్ విండ్ రూపంలో శక్తి విడుదల అవుతుంది. సూర్యుడి నుంచి ఆవేశిత కణాలు భూమిని చేరుతాయి. అయితే, భూమికి ఉండే బలమైన ‘‘అయస్కాంత క్షేత్రం’’ వీటి నుంచి భూమిని రక్షిస్తుంది. ఇది ఓ బుడగ మాదిరిగా భూమి చుట్టూ అంతరిక్షంలోకి వ్యాపించి ఉంటుంది. సోలార్ కాస్మిక్ కిరణాలను ఎప్పటికప్పుడు భూమి అయస్కాంత క్షేత్రం నెట్టేస్తుంది. అయితే, ఇది శాటిలైట్లతు, కమ్యూనికేషన్స్, పవర్ గ్రిడ్స్, జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్స్‌కి నష్టాన్ని కలిగించవచ్చు. రేడియేషన్ ఫలితంగా వ్యోమగాములు, విమాన ప్రయాణికులు ప్రభావితం కావచ్చు.

Read Also: RAJASTHAN: మూడేళ్ల పాపను కారులో మరిచి వెళ్లిన తల్లిదండ్రులు.. చివరకు విషాదం మిగిలింది..

ఇస్రో అప్రమత్తం:

ఈ భారీ సౌరతుఫానుతో ఇస్రో అప్రమత్తం అయింది. కర్నాటకలోని హసన్ మరియు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఇస్రో యొక్క మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (MCF) మన గ్రహం చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలను అవిరామంగా పర్యవేక్షించడానికి మరియు రక్షించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఎంసీఎఫ్ శాటిలైట్ల ఇనిషియల్ ఆర్బిట్ రైజింగ్, ఇన్-ఆర్బిట్ పేలోడ్ టెస్టింగ్ మరియు ఆన్-ఆర్బిట్ కార్యకలాపాలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కార్యకలాపాలలో నిరంతర ట్రాకింగ్, టెలిమెట్రీ మరియు కమాండింగ్ ఉంటాయి.

సోలార్ మెటిరియల్ భూమి వైపు వేగంగా రావడంతో అప్రమత్తంగా వ్యవహరించింది. దీని ఫలితంగా స్పేస్ ‌క్రాఫ్ట్‌లో మూమెంటమ్ వీల్ స్పీడ్, ఎలక్ట్రిక్ కరెంట్స్‌ వ్యత్యాసాలను గమనించవచ్చు. దీంతో ఇస్రో శాటిలైట్లలోని కొన్ని సెన్సార్లు, ముఖ్యమైన కొన్ని వ్యవస్థలను క్రియారహితంగా మార్చాయి. అంతే కాకుండా ఇస్రో యొక్క 30 జియోస్టేషనరీ ఉపగ్రహాల నెట్‌వర్క్ క్షీణించబడలేదని ఇస్రో నిర్ధారించింది.

Show comments