సెలాయూర్ నివాసి అయిన ఆనందన్, ఎర్త్ మూవర్స్ సరఫరా చేసే సంస్థను నడుపుతున్నాడు. అతను తన వ్యాపారం కోసం ఒక వాహనాన్ని కొనుగోలు చేయడానికి చోళమండలం ఫైనాన్స్ నుండి రుణం తీసుకున్నాడు. రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమైనందుకు తమిళనాడులో 43 ఏళ్ల ఆనందన్ పై ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది దాడి చేశారు. ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి అని చెప్పుకున్న వ్యక్తి తనను మొదట బెదిరించాడని ఆయన ఆరోపించారు. ఆ తరువాత, ఆ వ్యక్తి అతని ఇంటి ముందు అతని కోసం వేచి ఉండి అతనిపై దాడి చేశాడు.
Read Also: Police Fine: ఆ దెబ్బకు ఆడీ కారులో హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తున్న వ్యక్తి.. మ్యాటరేంటంటే..
కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన గడువు ముగిసిన ఈఎంఐ చెల్లింపు గురించి తన నివాసానికి వచ్చాడని అనధన్ చెప్పారు. అతను తక్షణమే చెల్లింపును డిమాండ్ చేశాడని, లేకపోతే పరిణామాలను ఎదురుకుంటావని బెదిరించాడని తెలిపాడు. పరిణామాల గురించి తాను అడిగినప్పుడు, వాహనాన్ని జప్తు చేస్తానని బెదిరించాడు. దానికి నేను అంగీకరించానని.. కానీ., అతను అసభ్యంగా ప్రవర్తించాడని ఆనందన్ చెప్పాడు.
అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆ కంపెనీ సిబ్బంది సభ్యుడు వేచి ఉండి., అతనిపై భౌతికంగా దాడి చేశాడని వివరించాడు. కీచైన్ల గుత్తిని ఉపయోగించి పదేపదే అతని ముఖం మీద కొట్టాడని, గాయాలు అయ్యాయని ఆయన ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీలో ఆ వ్యక్తి ఆనందన్ ముఖం, తలపై పదేపదే దాడి చేయడం కనిపించింది. సుమారు 30 సెకన్ల తరువాత, ఇద్దరు మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చి ఇద్దరిని వేరు చేయడం కనిపిస్తుంది.