NTV Telugu Site icon

Supreme Court: హంతకులకు ఎలా తెలిసింది..? అతిక్ అహ్మద్ హత్య కేసులో యూపీ ప్రభుత్వానికి ప్రశ్నలు..

Atiq Ahmed

Atiq Ahmed

Supreme Court On Atiq Ahmad killing: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ హత్య కేసులో యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నల్ని సంధించింది. అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ లను ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తున్న సందర్భంలో దుండగులు హత్య చేశారు. ఈ విషయంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ హత్యలపై స్వతంత్ర దర్యాప్తు కోరతూ న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసి పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది.

Read Also: Joe Biden: బైడెన్‌కు మతిమరుపు వచ్చిందా..? చివరి విదేశీ పర్యటన కూడా గుర్తు లేదా..?

అతిక్ అహ్మద్ ను ఆస్పత్రికి తీసుకువస్తున్న విషయం వారికి ఎలా తెలిసింది..? హాస్పిటల్ ప్రవేశ ద్వారం నుంచి ఆంబులెన్స్ లో ఎందుకు తీసుకెళ్లలేదు..? ఎందుకు నడిపించుకుంటూ తీసుకెళ్లారని కోర్టు ప్రశ్నించింది. యూపీ ప్రభుత్వం తరుపున హాజరైన ముకుల్ రోహాత్గీ.. కోర్టు ఆదేశాల మేరకే వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లినట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతీ రెండు రోజులకు ఒకసారి వారిని వైద్య పరీక్షలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి ఇది మీడియాకు తెలిసిందని అతను సుప్రీంకు తెలియజేశాడు. అతిక్ అహ్మద్, అతని కుటుంబం గత 30 ఏళ్లుగా నేరాలకు పాల్పడుతున్నారని.. ఈ హత్య భయంకరమైన సంఘటన అని, అందుకు కారణం అయిన నిందితులను పట్టుకున్నట్లు రోహాత్గీ కోర్టుకు తెలిపారు.

హంతకులు న్యూస్ ఫోటోగ్రాఫర్ల వేషంలో వచ్చారని, వారి వద్ద పాస్ లు ఉన్నాయని, కెమెరాలు ఉన్నాయని, గుర్తింపు కార్డులు ఉన్నాయని, ప్రతీ ఒక్కరూ ఈ హత్యను టీవీల్లో చూశారని, అవి నకిలీవని తేలిందని ఆయన కోర్టుకు తెలిపారు. హత్య జరిగే సమయంలో 50 కన్నా ఎక్కువ మంది అక్కడే ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ హత్యపై ముగ్గురు సభ్యుల కమిషన్ ఏర్పాటు చేసిందని, యూపీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఈ విషయాన్ని విచారిస్తోందని రోహాత్గీ సుప్రీంకోర్టు కు తెలిపారు. ఏప్రిల్ 15 రాత్రి పోలీసుల సమక్షంలో ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అతిక్, అష్రఫ్ లను కాల్చి చంపారు.

Show comments