NTV Telugu Site icon

Air India Urinating Case: ఫోన్ స్విచ్చాఫ్.. నిందితుడు మిశ్రా ఎలా చిక్కాడంటే?

Shankar Mishra Case

Shankar Mishra Case

How Delhi Police Arrested Air India Unirating Case Accused Shankar Mishra: ఎయిర్‌ ఇండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటనలో నిందితుడు శంకర్‌ మిశ్రాను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరులో శుక్రవారం అర్ధరాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అప్పటికే పరారీలో ఉన్న మిశ్రా, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. తన లొకేషన్ తెలియకుండా ఉండేందుకు ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఎవరితోనైనా సంభాషించాలన్నా.. సామాజిక మాధ్యమాల ద్వారానే చేసేవాడు. కానీ ఏం లాభం.. అతని పప్పులు ఎక్కువసేపు ఉడకలేదు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, తమదైన శైలిలో గాలింపు చర్యలు చేపట్టి, అతడ్ని అరెస్ట్ చేయడం జరిగింది.

Urfi Javed: నాకు బట్టలంటే ఎలర్జీ.. అందుకే వేసుకోకుండా తిరుగుతాను

తొలుత.. పోలీసులు మిశ్రాపై జనవరి 4వ తేదీన కేసు నమోదు చేయడానికి ఒకరోజు ముందే, అతడు తన మొబైల్ ఫోన్‌ని స్విచ్చాఫ్ చేశాడు. కేసు నమోదు చేశాక ఫోన్ స్విచ్చాఫ్ అయిన సంగతి తెలుసుకున్న పోలీసులు.. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్‌ ట్రేసింగ్‌, బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించారు. ముంబయి, బెంగళూరులోని తన కంపెనీ కార్యాలయాల మధ్య మిశ్రా గతంలో తరచూ ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడు బెంగళూరులో ఉన్నట్టు తేలింది. దీంతో.. ఢిల్లీ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించింది. బెంగళూరులోని తన ఆఫీస్‌కి మిశ్రా వెళ్లాడని తెలుసుకున్న పోలీసులు.. అక్కడ విచారించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే ట్రావెల్ హిస్టరీని ట్రాక్ చేశారు. శుక్రవారం రాత్రి మైసూరులో అతని ఆచూకీ లభ్యమవ్వడంతో.. అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే అతడు మైసూరు వీడాడు.

Serial Killer: హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్.. వృద్ధ మహిళలే లక్ష్యం, ఇప్పటివరకు 3 హత్యలు

మైసూర్ నుంచి ఏ ట్యాక్సీలో వెళ్లాడన్న సమాచారాన్ని సేకరించిన పోలీసులు.. ఎట్టకేలకు ట్యాక్సీ డ్రైవర్ వివరాలు తెలుసుకున్నారు. అతని నుంచి కీలక ఆధారాలు లభించాయి. ఫైనల్‌గా.. బెంగళూరులో మిశ్రా లొకేషన్ అభ్యమవ్వడంతో, పోలీసుల బృందం వెంటనే రంగంలోకి దిగింది. స్థానిక పోలీసులు సహకారంతో మిశ్రాను అదుపులోకి తీసుకుంది. శనివారం రాత్రి అతడ్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచగా.. అతనికి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపించింది. మరోవైపు.. ఘటనా సమయంలో ఉన్న విమాన పైలట్‌, క్యాబిన్‌ సిబ్బందిపై ఎయిర్‌ ఇండియా ఇప్పటికే వేటు వేసింది.

Broke Bottle Head : ‘సల్మాన్ ఖాన్ నా తలపై బాటిల్ పగులగొట్టాడు’.. ప్రియురాలు సోమి అలీ