NTV Telugu Site icon

Ayodhya Event: రామ మందిర వేడుక వేళ రూల్స్ ఉల్లంఘించారో AI పట్టేస్తుంది..

Ram Mandir

Ram Mandir

Ayodhya Event: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని 7000 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది.

భద్రతా ఉల్లంఘనలపై ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. తాజా బెదిరింపుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు దాదాపు 12,000 మంది సిబ్బందిని అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించింది. అయితే నేరస్తుల ఆటకట్టించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని కూడా ఉపయోగిస్తున్నారు.

Read Also: Khalistan: ప్రభుత్వ పాఠశాల గోడపై “ఖలిస్తానీ” అనుకూల రాతలు.. దర్యాప్తు ప్రారంభం..

ప్రాణప్రతిష్ట వేడుక ముందు సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ అయోధ్యకు ఉన్నతస్థాయి సైబర్ నిపుణుల బృందాన్ని పంపింది. అయోధ్య భద్రతను పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం చేశారు. ఇక్కడ నుంచే వివిధ భద్రతా ఏజెన్సీలు రియల్‌టైంలో సెక్యూరిటీని పర్యవేక్షిస్తాయి.

ముఖ్యంగా అనుమానిత కార్యకలాపాలను గుర్తించేందుకు, నేరస్తులు, దుర్మార్గులను గుర్తించేందుకు భద్రతా ఏజెన్సీలు తొలిసారిగా AI నిఘా వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. అయోధ్య చుట్టుపక్కల 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారుగా ఎల్లోజోన్ పరిధిలో ఉన్నాయి. ఎల్లో జోన్‌లో మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ కోసం AIని ఉపయోగిస్తున్నామని యూపీ పోలీస్ లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ అన్నారు. నేరస్తులను గుర్తించడంలో, సరిపోల్చడంలో సాయం చేయడానికి ఏఐకి ఉత్తర్ ప్రదేశ్ క్రిమినల్ డేటా బేస్ పోర్టల్‌ని అప్‌లోడ్ చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన AI- ఆధారిత CCTV నిఘా వ్యవస్థ వ్యక్తులు లేదా ఏదైనా సమూహాలు అసాధారణంగా ప్రవర్తించడాన్ని గుర్తించేందుకు సాయపడుతుంది.