Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News How A Simi Terrorist Was Arrested By Delhi Police After 22 Year Manhunt

SIMI Terrorist: 22 ఏళ్లుగా పరారీలో ఉన్న సిమి టెర్రరిస్ట్ హనీఫ్ షేక్ అరెస్ట్.. ఒకే క్లూతో చిక్కాడు..

Published Date :February 25, 2024 , 8:25 pm
By Venu Goapl Reddy
SIMI Terrorist: 22 ఏళ్లుగా పరారీలో ఉన్న సిమి టెర్రరిస్ట్ హనీఫ్ షేక్ అరెస్ట్.. ఒకే క్లూతో చిక్కాడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

SIMI Terrorist: నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమి) ఉగ్రవాది హనీఫ్ షేక్ పోలీసులకు చిక్కాడు. 22 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇతడిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ ఫిబ్రవరి 22న అరెస్ట్ చేసింది. కేవలం ఒకే ఒక క్లూ అయిన అతని మారుపేరు సాయంతో భయంకరమైన ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. ఇతడికి హనీఫ్ షేక్, మహ్మద్ హనీఫ్ మరియు హనీఫ్ హుదాయి పేర్లు ఉన్నాయి. 2002లో పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించారు.

2001లో ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఇతడిపై దేశద్రోహ అభియోగాలు, ఉపా చట్టం కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హనీఫ్ షేక్ సిమి ఆధ్వర్యంలో నడిచే ‘ఇస్లామిక్ మూవ్‌మెంట్’ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా ఉన్నాడు. అనేక మంది ముస్లిం యువకులను ర్యాడికలైజ్ చేశాడు. పోలీసులు ఇతడిని పెట్టుకునేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే, పోలీసులకు కేవలం పత్రికలో ఉన్న ‘హనీఫ్ హుదాయి’ అనే ఒకే క్లూ ఉంది. ఢిల్లీ పోలీసులు సదరన్ రేంజ్ స్పెషల్ సెల్ హనీఫ్ షేక్ కోసం నాలుగేళ్లుగా ప్రయత్నిస్తోంది.

Read Also: Haryana: ఐఎన్ఎల్‌డీ చీఫ్ నఫే సింగ్ రాథీని కాల్చి చంపిన దుండగులు..

ఎలా చిక్కాడు:

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక, కేరళలో జరిగిన సిమి సమావేశాలకు హనీఫ్‌ షేక్‌ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వీటిపై దాడులు జరిగిన పలు సందర్భాల్లో హనీఫ్ పోలీసుల నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. ఢిల్లీ పోలీసులు ఇతడి సమాచారాన్ని అనేక రాష్ట్రాలకు పంపింది. ఇతడిని పట్టుకునేందుకు ఏడు రాష్ట్రాల్లో పోలీసులు ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేశారు.

షేక్ తన గుర్తింపు మార్చుకుని మహారాష్ట్రలోని భుసావల్ లోని ఉర్దూ పాఠశాలలో పనిచేస్తున్నట్లు ఇన్‌ఫార్మర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో పక్కా ప్లాన్ చేసి అతడిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 22న మహ్మదీన్ నగర్ నుంచి ఖడ్కా రోడ్డుకు వెళ్తున్న అనుమానాస్పద వ్యక్తి హనీఫ్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు షేక్‌ను అడ్డుకుని అరెస్ట్ చేసినట్లు స్పెషల్ సెల్ డీసీపీ అలోక్ కుమార్ చెప్పారు.

హనీఫ్ షేక్ ఎవరు..?

హనీఫ్ షేక్ 1997లో సిమిలఅో చేరాడు. దాని సభ్యుల సాన్నిహిత్యంతో అతను ఉగ్రవాదం వైపు మారాడు. అప్పటి నుంచి పలువురు ముస్లిం యువకులను సిమిలో చేర్చుకోవడం ప్రారంభించాడు. 2001లో అప్పటి సిమి అధ్యక్షుడు సాహిద్ బదర్, ‘ఇస్లామిక్ మూవ్‌మెంట్’ ఉర్దూ ఎడిషన్‌కు హనీఫ్ షేక్‌ను ఎడిటర్‌గా నియమించారు. షేక్ పత్రిక సంపాదకుడిగా ఉన్న సమయంలో భారతదేశంలోని ముస్లింలపై అనేక రెచ్చగొట్టే కథనాలు రాశారు.

ఢిల్లీలోని జకీర్ నగర్ లో సిమి ప్రధాన కార్యాలయంలో హనీఫ్ షేక్‌కి గది ఇచ్చాడు. 2001లో పోలీసుల దాడిలో హనీఫ్ షేక్ మరికొంతమందితో కలిసి తప్పించుకుని అండర్‌గ్రౌండ్‌కు వెళ్లాడు. సిమిలో ప్రజల్ని చేర్చేందుకు యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇతను పర్యటించినట్లు అంగీకరించాడు. సిమిపై నిషేధం విధించడంతో ‘‘వహ్దత్-ఎ-ఇస్లాం’’ పేరుతో కొత్త సంస్థను స్థాపించారు. దీనిలో కూడా సిమిలో ఉన్న సభ్యులే సభ్యులుగా చేరారు. ఈ సంస్థ కీలక సభ్యుల్లో షేక్ ఒకరు. ఈ సంస్థకు నిధుల కోసం విరాళాల ముసుగులో డబ్బు వసూలు చేస్తున్నాడు. ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delhi police
  • SIMI
  • SIMI Terrorist
  • terrorist arrest

తాజావార్తలు

  • Pakistan: పెనం నుంచి పొయ్యిలో పడ్డ పాక్.. 2 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందేనన్న యూఏఈ!

  • Maharashtra: నాసిక్‌లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

  • Shreyas Iyer Fined: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ జరిమానా.. ఇంకోసారి చేస్తే మ్యాచ్ సస్పెన్షన్.?

  • GHMC: ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా.. వారికి బిగ్ వార్నింగ్

  • kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions