NTV Telugu Site icon

వేడి నీళ్లతో స్నానం చేస్తే… కరోనా దూరం అవుతుందా?

కరోనా కాలంలో ఎవరు ఏం చెప్పినా దానిని ఫాలో అవుతుంటారు.  గత కొన్నిరోజులుగా కొన్ని రకాల చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  వేడినీళ్ళతో కరోనాకు చెక్ పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి.  వేడి నీళ్లను తాగడం వలన, స్నానం చేయడం వలన కరోనా తగ్గిపోదని, 70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రమే ఈ వైరస్ చనిపోతుందని నిపుణులు చెప్తున్నారు.  ఇక వేడినీళ్లు తాగడం వలన శరీరంలో అవయవాలు యాక్టివ్ అవుతాయని, వేడినీళ్ళతో స్నానం చేయడం వలన కండరాల నొప్పులు తగ్గుతాయని, మెదడకు రక్తసరఫరా జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.