NTV Telugu Site icon

Hafiz Saeed: ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయాద్‌పై విష ప్రయోగం.. సోషల్ మీడియాలో దుమారం..

Hafiz Saeed

Hafiz Saeed

Hafiz Saeed: 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రసంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న అతని పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా హఫీజ్ సయీద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో, అమెరికా ఒత్తిడితో పాక్ అధికారులు అతడిని జైలులో ఉంచారు. అయితే, జైలులో అతడిపై విష ప్రయోగం జరిగిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలను పాకిస్తాన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అక్కడి మీడియాలో దీనిపై ఊసేలేదు. అధికారుల నుంచి ఎలాంటి అధికార ప్రకటన కూడా రాలేదు.

Read Also: Israel: ఇరాన్ దాడి చేస్తుందనే, గాజా నుంచి ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ..

26/11 ముంబై ఉగ్రదాడులకు వెనక ఇతను కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఈ దాడిలో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి హఫీస్ సయీద్‌ని తమకు అప్పగించాలని భారత్ కోరుతోంది. అయితే, పాకిస్తాన్ మాత్రం సరైన ఆధారాలు లేవని, ఈ ఆధారాలు పాకిస్తాన్ చెబుతూ వస్తోంది. అయితే, ఇటీవల కాలం పాకిస్తాన్లో వరసగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో హఫీస్ సయీద్ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.

కెనడా, అమెరికాతో పాటు బ్రిటన్‌కి చెందిన కొన్ని పత్రికలు ఈ దాడుల వెనక భారత ఇంటెజెన్స్ వ్యవస్థ ఉందనే కథనాలను ప్రచురిస్తున్నాయి. ఇటీవల యూకేకి చెందిన ది గార్డియన్ పాకిస్తాన్‌లో జరుగుతున్న టార్గెటెడ్ కిల్లింగ్స్‌లో భారత ప్రయేయం ఉందని ఆరోపించింది. అయితే, భారత్ మాత్రం వీటిని నిరాధారమైన వార్తలుగా కొట్టిపారేసింది. పాకిస్తాన్ మాత్రమే కాకుండా కెనడాలో గతేడాది ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఈ కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల్ని భారత్ ఖండించింది.

Show comments