Site icon NTV Telugu

Yogi Adityanath: యోగి ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. రాహుల్ గాంధీ కూడా ఆయన తర్వాతే..

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలోయింగ్ మామూలుగా లేదు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఎక్స్(ట్విట్టర్)లో యోగి సంచలనం సృష్టించారు. గడిచిన 30 రోజుల్లోనే ఆయనకు 2.67 లక్షల మంది కొత్త ఫాలోవర్లు పెరిగారు. ఎక్కువ మంది కొత్త పాలోవర్లను సంపాదించుకున్న రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్రమోడీ మొదటిస్థానంలో ఉన్నారు. ప్రధాని మోడీకి 30 రోజుల్లో 6.32 లక్షల మంది కొత్త ఫాలోవర్లు పెరిగారు.

Read Also: Article 370: ఆర్టికల్ 370 రద్దుపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు..

ఎక్స్ లో యోగి ఆదిత్యనాథ్ కి మొత్తంగా 26 మిలియన్లు (2,59,81,782)మంది అనుచరులు ఉన్నారు. గత 30 రోజుల్లో ఎక్కువ ఫాలోవర్లను సంపాదించుకున్న వ్యక్తులు, సంస్థల జాబితాను ఎక్స్ (ట్విట్టర్) రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ఇండియా లోని రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్రమోడీ మొదటి స్థానంలో ఉంటే సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండోస్థానంలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మూడోస్థానంలో ఉన్నారు. ఫాలోవర్లను పెరుగుదల రాహుల్ తో పోలిస్తే యోగికే అధికంగా ఉంది. భారతదేశంలో ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్ కి సోషల్ మీడియాలో ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది.

మొత్తంగా చూస్తే కొత్త ఫాలోవర్లను సంపాదించుకోవడంతో ఇస్రో (11,66,140) తొలిస్థానంలో ఉంటే, ప్రధాని మోడీ రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ (4,74,011) మూడోస్థానంలో వీరి తర్వాత నాలుగో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.

Exit mobile version