Site icon NTV Telugu

Amit Shah: జమ్మూకాశ్మీర్ పర్యటనలో అమిత్ షా.. జమ్మూ, రాజౌరిలో నిలిచిన మొబైల్ ఇంటర్నెట్ సేవలు

Amit Shah Jammu Kashmir Visit

Amit Shah Jammu Kashmir Visit

Home Minister Amit Shah’s visit to Jammu and Kashmir: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. అమిత్ షా తొలిసారిగా శ్రీ మాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంఝి చాట్ హెలిప్యాడ్ నుంచి కట్రా చేరుకున్నారు అమిత్ షా. ఆయన వెంట జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితెంద్ర సింగ్ ఉన్నారు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైష్ణోమాత ఆలయానికి రావడం ఇదే తొలిసారి.

ఆలయ దర్శనం అనంతరం రాజౌరిలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు అమిత్ షా. ఇదిలా ఉంటే రాజౌరిలో ఈ రోజు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అధికారులు. అమిత్ షా ర్యాలీ ఉండటంతో ఎలాంటి శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా రాజౌరి అంతా మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. జమ్మూ ప్రాంతంలో కూడా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అధికారులు.

Read Also: Chidambaram Nataraja Temple: చిదంబర ఆలయ సంపద వివాదం.. ప్రభుత్వంపై పురోహితులు ఫైర్

జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటి తర్వాత జమ్మూలోని రఘునాథ్ ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు. జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రతల గురించి అక్కడి అధికారులతో అమిత్ షా సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర అధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం బారాముల్లా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొననున్నారు.

రేజు జమ్మూలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత బకర్వాల్, గుజ్జర్ సంఘాలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. 2008లో బీజేపీలో గుజ్జర్ తెగకు చెందిన గులాం అలీని రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ. అమిత్ షా పర్యటనలో బీజేపీ ఎంపీలు, ఇతర నాయకులతో సమావేశం కానున్నారు. 2019 ఆగస్టులో మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370,35ఏ ఆర్టికల్స్ రద్దు చేసిన తర్వా జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో అమిత్ షా పర్యటించడం ఇది రెండోసారి.

Exit mobile version