Hoax bomb threat: విమానాల్లో స్కై మార్షల్స్ సంఖ్య పెంపు.. నకిలీ బాంబు బెదిరింపులపై కీలక నిర్ణయం..!
- మూడు రోజుల్లో 12 విమానాలకు బాంబు బెదిరింపులు..
- సీరియస్‌గా విచారిస్తున్న కేంద్ర ఏజెన్సీలు..
- విమానాల్లో స్కై మార్షల్స్ సంఖ్య పెంపు..?
- బెదిరింపులకు పాల్పడే వారు ‘‘నో ఫ్లై’’ జాబితాలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hoax bomb threat: గత మూడు రోజులుగా భారతీయ విమానసంస్థలు నకిలీ బాంబు బెదిరింపుల్ని ఎదుర్కొంటున్నాయి. సోమవారం నుంచి ఈ రోజు బుధవారం వరకు మొత్తం 12 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ రోజు ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి, ఢిల్లీ నుంచి బెంగళూర్ వెళ్తున్న ఆకాస విమానానికి బాంబు ఉందంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయి. మంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిరిండియా విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో విమానాన్ని కెనడాలోని ఓ మారుమూల విమానాశ్రయంలో ల్యాండ్ చేసి, తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది.
Read Also: Canadian Sikh MP: భారత్‌పై ఆంక్షలు, ఆర్ఎస్ఎస్‌పై బ్యాన్.. కెనడియన్ సిక్కు ఎంపీ కామెడీ..
Also Read
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర పౌరవిమానయాన అధికారులు అత్యున్న సమావేశం నిర్వహించారు. మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, హోం మంత్రిత్వ శాఖ అధికారులు భేటీలో పాల్గొన్నారు. సమాచారం ప్రకారం.. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈ బూటకపు కాలర్లను గుర్తించి వీరిని ‘నో ఫ్లై’ జాబితాలో చేర్చేందుకు సమాయత్తమవుతోంది. ఇదే విధంగా విమానాల్లో ఎయిర్ మార్షల్స్ సంఖ్యను రెట్టింపు చేయడంపై కూడా చర్చ జరుగుతోంది. ఎన్ఎస్‌జీ కమాండో యూనిట్ ఎయిర్ మార్షల్స్‌ని ప్రధానంగా అంతర్జాతీయ మార్గాలు, దేశీయంగా సున్నితమైన మార్గాల్లో మోహరించనున్నారు. స్కై మార్షల్స్ సాధారణ ప్రయాణికుల వలే విమానంలో ప్రయాణించే సాయుధ భద్రతా అధికారులు.
బాంబు బెదిరింపులపై నివేదిక సమర్పించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి)లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. భారతదేశ విమానరంగానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!