Site icon NTV Telugu

Uddhav Thackeray: ప్రధాని మోడీని హిట్లర్‌తో పోల్చిన ఠాక్రే..

Shivsenaubt

Shivsenaubt

Uddhav Thackeray: ప్రధాని నరేంద్ర మోడీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. ఆదివారం శివసేన వ్యవస్థాపక దినోత్సవానికి ఒక రోజు ముందు ముంబైలోని పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు. మోడీని జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో పోల్చాడు. హిట్లర్ కూడా ఇలాగే చేశాడని, ముందుగా మీడియాను నియంత్రించి, ఆ తరువాత అధికారాన్ని కేంద్రీకరించాడని, మనం హిట్లర్ మార్గాన్ని అనుసరిస్తున్నామా…? అని ప్రశ్నించారు.

Read Also: Honour killing: ప్రేమిస్తోందని కూతురుని చంపేసిన తండ్రి.. లవర్‌ని కూడా వదిలిపెట్టలేదు..

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన సమయంలో సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చింది. ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ రోరేసీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..అడాల్ఫ్ హిట్లర్ ప్రస్తావించారు. ఘర్షణలతో ఉద్రిక్తంగా ఉన్న మణిపూర్ రాష్ట్రాన్ని ప్రధాని సందర్శించకపోవడంపై ఉద్దవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ధైర్యం ఉంటే ఈడీ, సీబీఐ బృందాలను అక్కడికి పంపాలని, అక్కడి ప్రజలు వీరిని మాయం చేస్తారని అన్నారు. హోం మంత్రి అమిత్ షాను ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీతో పోల్చాడు. ఉద్దవ్ ఠాక్రే తన కార్యకర్తనలు ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. మీలాంటి యోధులు నాలో ఉండటం నా అదృష్టమని, నేను మీ రుణాన్ని తీర్చుకోలేనని, నాదగ్గర పార్టీ లేదు, పార్టీ గుర్తు లేదు అయినా మీరంతా నాతోనే ఉన్నారని అన్నారు.

Exit mobile version