Site icon NTV Telugu

PM Modi: భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. ప్రకటించిన ప్రధాని మోడీ

Modi1

Modi1

భారత్-ఐరోపా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగినట్లుగా ప్రధాని మోడీ వెల్లడించారు. మంగళవారం గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్‌- 2026ను మోడీ వర్చువల్‌గా ప్రారంభించి ట్రేడ్‌ డీల్‌ గురించి మాట్లాడారు. సోమవారం భారత్-ఈయూ మధ్య ప్రధాన ఒప్పందంపై సంతకాలు జరిగాయని.. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: US-Europe: అమెరికా లేకుంటే ఐరోపాకు భద్రతా ఎక్కడది? నాటో చీఫ్ సంచలన వ్యాఖ్యలు

దాదాపు రెండు దశాబ్దాల చర్చల తర్వాత జనవరి 27న భారత్-ఈయూ సమ్మిట్‌లో భారతదేశం-యూరోపియన్ యూనియన్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించాయి. సమ్మిట్‌కు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సహ అధ్యక్షత వహించారు.

ఇది కూడా చదవండి: US: భారత్-ఈయూ ఒప్పందం వేళ అమెరికా షాక్.. డీల్‌పై హాట్ కామెంట్స్

ఈ భారీ ఒప్పందం రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య తయారీ రంగాన్ని.. సేవలను పెంచుతుందని ప్రధాని మోడీ అన్నారు. రెండు వైపులా వ్యాపారాలు.. ప్రజలకు ప్రధాన అవకాశాలను సృష్టిస్తుందని మోడీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు-యూరోపియన్ దేశాలలోని మిలియన్ల మంది ప్రజలకు అద్భుతమైన అవకాశాలను తెస్తుందని చెప్పారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి ఈ ఒప్పందం ఒక అద్భుతమైన ఉదాహరణ అని చెప్పారు. ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం వహిస్తుందని వెల్లడించారు. ఇది వాణిజ్యం పట్ల మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యం, చట్ట పాలన పట్ల కూడా ఉమ్మడి నిబద్ధతను బలపరుస్తుందని తెలిపారు.

Exit mobile version