NTV Telugu Site icon

PM Modi: ఇది టెక్‌, డేటా నడిపించే శతాబ్దం.. అభివృద్ధి ప్రతి రంగంలో కనిపిస్తోంది!

Modi

Modi

PM Modi: ది రైజింగ్‌ రాజస్థాన్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ 2024లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారుడు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 11వ తేదీ వరకు కొనసాగనుంది. భారత్‌ చేసిన అభివృద్ధి ప్రతి రంగంలోనూ కనబడుతుందని చెప్పుకొచ్చారు. కాగా, గత 10 ఏళ్లలో భారత్‌ 10 అతి పెద్ద ఆర్థికవ్యవస్థల నుంచి 5వ స్థానానికి చేరిందన్నారు. గత 15 ఏళ్లుగా ఆర్థికవ్యవస్థ మారడంతో ఎగుమతులు పెరిగాయని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Read Also: Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

ఇక, దేశంలో ఎఫ్‌డీఐలు కూడా రెండింతలు పెరిగాయని నరేంద్ర మోడీ తెలిపారు. అలాగే, భారత్ లో ఇన్ఫ్రాపై వ్యయాలు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్లకు చేరాయన్నారు. వైవిధ్యభరితమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడం చాలా మంచిదన్నారు. ఇంకా కొన్నేళ్ల పాటు మనం అత్యంత యువ దేశంగా ఉండబోతున్నామన్నారు. ప్రస్తుతం టెక్‌, డేటా నడిపించే శతాబ్ధం అని చెప్పుకొచ్చారు. గత పదేళ్లలో ఇంటర్నెట్‌ వినియోగం నాలుగు రెట్లకు పైగా పెరిగిందన్నారు. ఇక, డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్ భారీగా పుంజుకుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Read Also: Adilabad: ఇంద్రవెల్లి లో ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన సభ.. డిమాండ్లు ఇవే..

కాగా, స్వాతంత్ర్యం వచ్చిన ప్రభుత్వాలు రాజస్థాన్‌ అభివృద్ధి, సంస్కృతిని బాగా నిర్లక్ష్యం చేశాయని ప్రధాన మంత్రి మోడీ పేర్కొన్నారు. అందుకే ఈ రాష్ట్రం బాగా నష్టపోయిందన్నారు. వికాస్‌ భీ- విరాసత్‌ భీ అనే మంత్రంతో మా సర్కార్ పని చేస్తోంది.. పెట్టుబడులకు రాజస్థాన్‌లోని పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. భారత్‌లో అతి పెద్ద సోలార్‌ పార్కుల్లో చాలా వరకు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు ఎయిర్‌ కార్గో కాంప్లెక్సులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని నరేంద్ర మోడీ తెలిపారు.