Anna Hazare: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్‌తో సహా కీలక నేతలైన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ వంటి వారు ఓటమి పాలయ్యారు. అయితే, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హాజరే స్పందించారు. కేజ్రీవాల్‌ని విమర్శించారు. 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నాహజారేతో పాటు కేజ్రీవాల్ పాల్గొన్నారు.
Read Also: CM Chandrababu: ఈ నెల 10 తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం..
‘‘కేజ్రీవాల్నా హెచ్చరికల్ని పట్టించుకోలేదు. ఎక్సైజ్ విధానం గురించి హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదు’’ అని అన్నా హజరే అన్నారు. “ఒక అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి, జీవితం నింద లేకుండా ఉండాలి మరియు త్యాగం ఉండాలి అని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. ఈ లక్షణాలు ఓటర్లకు అతనిపై నమ్మకం కలిగిస్తాయి. నేను (అరవింద్ కేజ్రీవాల్‌కి) ఈ విషయం చెప్పాను కానీ అతను పట్టించుకోలేదు, చివరకు, అతను మద్యంపై దృష్టి పెట్టాడు… అతను ధన బలంతో మునిగిపోయాడు” అని దుయ్యబట్టారు.
అన్నా హజారే పలు సందర్భాల్లో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. 2022లో కేజ్రీవాల్‌కి లేఖ రాశారు. “మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మీకు లేఖ రాయడం ఇదే మొదటిసారి, ఎందుకంటే మీ ప్రభుత్వ మద్యం విధానం గురించి ఇటీవలి వార్తల నివేదికలతో నేను బాధపడ్డాను. మద్యం లాగే, అధికారం కూడా మత్తునిస్తుంది. మీరు అధికారంతో మత్తులో ఉన్నట్లు అనిపిస్తుంది” అని లేఖలో పేర్కొన్నారు.