Site icon NTV Telugu

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కు ఆ యువ‌కుడు పాద‌యాత్ర‌… ఎందుకంటే…

పాకిస్తాన్‌లో మ‌త‌మార్పిడులు స‌హ‌జం.  అక్క‌డ ఇత‌ర మ‌తస్థుల‌ను ఇస్లామ్ మతంలోకి బ‌ల‌వంతంగా మారుస్తుంటారు.  అయితే, హిందువులు అధికంగా ఉన్న భార‌త దేశంలో కూడా మ‌త‌మార్పిడిలు జ‌రుగుతున్నాయి.  దీనికోసం ప్ర‌లోభాల‌కు గురిచేస్తున్నారు.  ఇలాంటి వారిని ఇప్ప‌టికే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.  ఇలాంటి జాబితాలో మీర‌ట్‌కు చెందిన ప్ర‌వీణ్ కుమార్ అనే వ్య‌క్తి కూడా ఉన్నాడు.  ప్ర‌వీణ్ కుమార్ పేరు మ‌తం మార్పిడి చేసుకుంటున్న వారి లిస్ట్‌లోకి వెళ్ల‌డంతో ఏటీఎస్ పోలీసులు అత‌డిని విచార‌ణ జరిపారు.  ఎటీఎస్ అధికారులు అత‌నికి క్లీన్‌చీట్ ఇచ్చారు.  అయిన‌ప్ప‌టికీ సామాజికంగా ప్ర‌వీణ్ కుమార్ బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యారు.  త‌న‌తో పాటుగా త‌న కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ది.  ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని షీత‌ల్ ఖెడా గ్రామానికి చెందిన ప్ర‌వీణ్ కుమార్‌ను ఎటీఎస్ పోలీసులు ప్రశ్నించి వ‌దిలేశారు.  

Read: రూ. 25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్!

అయితే గ్రామ‌స్తులు మాత్రం దీనిని సీరియ‌స్ గా తీసుకుంది.  త‌ప్పుగా అర్ధం చేసుకుంది.  అత‌డిని, అత‌డి కుటుంబాన్ని గ్రామ‌స్తులు వెలివేశారు.  ఉగ్ర‌వాది అని, పాకిస్తాన్ వెళ్లిపోవాల‌ని చెప్పి గోడ‌ల‌పై రాశారు.  దీంతో త‌న స‌మ‌స్య‌కు సుప్రీంకోర్టు పరిష్కారం చూపించాల‌ని కోరుతూ షీతల్ ఖేడా గ్రామం నుంచి సుప్రీం కోర్టు వర‌కు న‌డుచుకుంటూ వెళ్ళాడు.  ఎండ‌ను, వ‌ర్షాన్ని లెక్క‌చేయ‌కుండా ప్ర‌వీణ్ కుమార్ 200 కిలోమీట‌ర్ల దూరాన్ని 11 రోజుల పాటు న‌డిచి గమ్య‌స్థానానికి చేరుకున్నారు.  త‌న స‌మ‌స్య‌కు సంబందించిన అభ్య‌ర్ధ‌న‌ను కోర్టుకు సమ‌ర్పించాడు.  

Exit mobile version