రూ. 25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్!

రామ్ చరణ్ భారీ మొత్తం గెలుచుకున్నాడనగానే ఈ స్టార్ హీరోకు ఏదో లాటరీ తగిలిందేమోనని ఊహించుకోకండి. అలాంటిదేమీ లేదు! పైగా చెర్రీకి లాటరీ టిక్కట్లు కొనే అలవాటు కూడా ఉండి ఉండదు. విషయం ఏమిటంటే… ఓ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ ఆగస్ట్ 15 నుండి ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమాన్ని యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యాఖ్యాతగా ప్రసారం చేయబోతోంది. అందులో మొదటి ఎపిసోడ్ లో మెగా పపర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనబోతున్నాడు. సో… ఓ రకంగా ఇది ‘ట్రిపుల్ ఆర్’ స్పెషల్ అని అనుకోవచ్చు. కోటి రూపాయలను టార్గెట్ చేస్తూ క్విజ్ లో పాల్గొన్న రామ్ చరణ్… ఫైనల్ టార్గెట్ ను రీచ్ కావడానికి రెండు స్టెప్ట్స్ ఇవతలే ఆగిపోయాడు. దాంతో అతను కేవలం 25 లక్షల రూపాయలతో తృప్తి పడాల్సి వచ్చిందని తెలుస్తోంది.

Read Also : ‘మిర్చి’ ఘాటు చూపించిన మెహబూబ్

కె.బి.సి. స్ఫూర్తితో జరుగబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే 16 ఎపిసోడ్స్ చిత్రీకరణ పూర్తి చేశారట. రామ్ చరణ్ ఎపిసోడ్ ను ఆగస్ట్ 16న ప్రసారం చేసి, అక్కడ నుండి రెగ్యులర్ కంటెస్టెంట్స్ తో షోను ఎన్టీయార్ నిర్వహించబోతున్నారు. మిగిలిన ఎపిపోడ్స్ ను ఎన్టీయార్ ‘ట్రిపుల్ ఆర్’కు సంబంధించిన ఉక్రెయిన్ షెడ్యూల్ నుండి రాగానే చిత్రీకరిస్తారట. మరి చెర్రీని యంగ్ టైగర్ ఏ యే ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు? వాటికి అతను ఎలా సమాధానం చెప్పాడు? జవాబు చెప్పలేక పోయిన ప్రశ్న ఏది? అనేది తెలుసు కోవాలంటే… ఆగస్ట్ 16 వరకూ వెయిట్ చేయాల్సిందే!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-