NTV Telugu Site icon

Himanta Biswa Sarma: హిందూ జనాభా తగ్గింది.. అస్సాం, బెంగాల్, జార్ఖండ్‌లో ఇదే పరిస్థితి..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ అల్లర్ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, అస్సాంలో తగ్గుతున్న హిందూ జనాభాపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. అస్సాం, బంగ్లా రెండింటిలో 2011 వరకు అనధికార జనాభా గణన డేటా ఇదే విషయాన్ని చూపుతుందని చెప్పారు. అస్సాంలో 1951 నుండి 2011 వరకు హిందూ జనాభా తగ్గిందని, ఇదే విషయాన్ని జనాభా గణన నివేదిక పేర్కొందని, అస్సాంలో 9.23 శాతం, బంగ్లాదేశ్‌లో 13.5 శాతం క్షీణించినట్లు చెప్పారు.

Read Also: Narne Nithin: ‘ఆయ్’ అందుకే అనుకున్నాం.. ట్రైలర్ ఎన్టీఆర్‌కి బాగా న‌చ్చింది : నార్నే నితిన్‌ ఇంటర్వ్యూ

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గాజా పరిస్థితిపై శ్రద్ధ చూపుతోందని, బంగ్లాదేశ్ హిందువులను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆ దేశ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దౌత్యమార్గాల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందని, క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ఎదురవుతున్న సమస్యల గురించి మాట్లాడుతుంది, కానీ హిందువుల గురించి మాట్లాడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ సరిహద్దుకు ప్రజలు రావడం గురించి హిమంత మాట్లాడుతూ.. సరిహద్దు దాటడానికి ఎవరిని కేంద్ర ప్రభుత్వం అనుమతించదని అన్నారు. ఇది పరిష్కారం కాదని ప్రజలు సరిహద్దులు దాటేందుకు మేము అనుమతించలేమని చెప్పారు. దౌత్యమార్గాల ద్వారా బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రతను నిర్ధారించడమే పరిష్కారమని చెప్పారు.