Site icon NTV Telugu

Himanta Biswa Sarma: ‘‘చైనా బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే ఎలా..?’’ అస్సాం సీఎం అదిరిపోయే సమాధానం..

Assam Cm

Assam Cm

Himanta Biswa Sarma: చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే పరిస్థితి ఏమిటి..? అనే దానిపై అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ స్పందించారు. దీనిపై ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో ‘‘భయంతో కాదు, వాస్తవాలు, నేషనల్ క్లారిటీతో ఈ అపోహను తొలగిస్తాం’’ అని అన్నారు. బ్రహ్మపుత్ర భారత్‌కి చేరిన తర్వాత పెరిగే నది అని, కుచించుకుపోయే నది కాదని ఆయన తెలిపారు.

Read Also: Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఖలిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలు..

సీఎం హిమంత ప్రకారం, చైనా నుంచి వచ్చే బ్రహ్మపుత్ర ప్రవాహం 30-35 శాతం మాత్రమే ఉంటుందని, ఇది ప్రధానంగా హిమనీనదాలు కరగడం, పరిమిత వర్షపాతం నుంచే వస్తుందని నుంచి వస్తుంది. మిగతా 65-70 శాతం నది ప్రవాహం భారత్‌లో ప్రవహించే దాని ఉపనదులు, రుతపవన వర్షపాతం నుంచే వస్తుంది. బ్రహ్మపుత్ర ప్రవాహ డేటాను పరిశీలిస్తే.. ఇండో-చైనా సరిహద్దు వద్ద నది ప్రవాహం సగటున సెకనుకు 2,000 మరియు 3,000 క్యూబిక్ మీటర్ల ఉంటే, వర్షాకాలంలో అస్సాంలో ఇది 15,000-20,000 క్యూబిక్ మీటర్లకు పెరుగుతుంది. ఇది నది ప్రవాహంలో భారతదేశ ఆధిపత్యానికి నిదర్శనమని హిమంత బిశ్వ సర్మ చెప్పారు.

“బ్రహ్మపుత్ర నది భారతదేశం అప్‌స్ట్రీమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత బలోపేతం అవుతుంది” అని ఆయన అన్నారు. బ్రహ్మపుత్ర నదిని ఆయుధంగా మారుస్తామని చైనా ఎప్పుడూ అధికారికంగా బెదిరించలేదని, ఆ సూచనను ఊహాజనిత భయాందోళన కలిగించేదిగా తోసిపుచ్చారు. ఒక వేళ చైనా బ్రహ్మపుత్ర నీటిని అడ్డుకుంటే, ఇది అస్సాంలో వరదల్ని తగ్గిస్తుందని చెప్పారు. “బ్రహ్మపుత్ర ఒకే సోర్స్ ద్వారా నియంత్రించబడదు. ఇది మన భౌగోళికం, మన రుతుపవనాలు, మన నాగరికత స్థితిస్థాపకత ద్వారా శక్తిని పొందుతుంది” అని ఆయన ముగించారు. సింధు జలాల ఒప్పందం నిలిపేయడంతో పాకిస్తాన్ ఇప్పుడు భయాందోళనకు గురవుతోందని అన్నారు.

Exit mobile version