Site icon NTV Telugu

Surgical Strike: కేసీఆర్‌కు అస్సాం సీఎం కౌంటర్.. ఇదిగో సాక్ష్యం..!

సర్జికల్‌ స్ట్రయిక్స్‌కు సాక్ష్యమేదీ? అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించడంపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు బీజేపీ నేతలు.. తెలంగాణ బీజేపీ నేతలతో పాటు.. ఇతర రాష్ట్రాల వారు కూడా కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ… డియర్ కేసీఆర్, ఇదిగో మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యం అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశారు.. అయినప్పటికీ మీరు సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారు, వారిని అవమానిస్తున్నారు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన… మన సైన్యంపై దాడి చేసి దుష్ప్రచారం చేయడానికి మీరు ఎందుకు తహతహలాడుతున్నారు? అంటూ ఫైర్ అయ్యారు.. మన సైన్యాన్ని అవమానిస్తే నవ భారత్ సహించదు అని కేసీఆర్‌ను హెచ్చరించారు హిమంత బిశ్వా శర్మ.. కాగా, సర్జికల్‌ స్ట్రైక్‌ విషయంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రశ్నపై ఫైర్‌ అయిన అస్సాం సీఎం… మీ నాన్న ఎవరు? సాక్ష్యం ఉందా? అని మేం అడుగుతున్నామా? అంటూ చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.. అస్సాం సీఎం వ్యాఖ్యలపై కేసీఆర్‌ తీవ్రంగా ఖండిచిన విషయం కూడా విదితమే.

Exit mobile version