Site icon NTV Telugu

Himanta Biswa Sarma: కాంగ్రెస్ కు కష్టమే.. 2024 ఎన్నికల్లో 35 సీట్లే.!

Hs Sarma

Hs Sarma

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమే అని అన్నారు. 2024లో ఇప్పడు ఉన్న సీట్లు కూడా తగ్గుతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 30-35 సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు. ఇదిలా ఉంటే మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) హస్తం ఉందని అన్నారు.

తాజాగా అస్సాం బటద్రవాలో పోలీస్ స్టేషన్ ను కాల్చేసిన ఘటనలో పీఎఫ్ఐ ప్రమేయం ఉందని సంకేతాలు అందుతున్నాయని ఆయన అన్నారు. పీఎఫ్ఐ, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించాలని అస్సాం ప్రభుత్వం భావిస్తున్నట్లు హిమంత బిశ్వశర్మ వెల్లడించారు.

గతంలో ఈశాన్య రాష్ట్రాలు దేశానికి భారం అనే ప్రసంగాలు విన్నాం..కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత ఆ అభిప్రాయాలను మార్చుకున్నారు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల వారిపై జాతి వివక్షత తగ్గిందని.. ఢిల్లీ ఈశాన్య రాష్ట్రాల ముంగిటకు చేరిందని హిమంత బిశ్వ శర్మ అన్నారు.

ఇటీవల అస్సాంలో హిమంత బిశ్వ శర్మ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ప్రభుత్వ భూములను, హిందువుల భూములను ఆక్రమించుకున్నవారి అంతు చూస్తున్నాడు. సేమ్ యూపీలో యోగీ ఆదిత్యనాథ్ లాగే బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఇటీవల బటద్రవ పోలీస్ స్టేషన్ పై కొంతమంది దుండగులు దాడి చేశారు. వెంటనే నిందితులను గుర్తించి బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేశారు అధికారులు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమ వలసదారులుగా ఉన్నవారిపై ఉక్కుపాదం మోపుతోంది హిమంత బిశ్వ శర్మ సర్కార్.

Exit mobile version