Hijab-Wearing Muslim Will Become PM, says asaduddin owaisi: హిజాబ్ ధరించడం వల్ల ముస్లిం మహిళలు తమ తోటి వారి కన్నా ఏమాత్రం తక్కువ కారని అన్నారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ప్రాథమిక హక్కులు పాఠశాల గేటు దగ్గరే నిలిచిపోతాయా..? అని.. దేశ చట్టాలు హిజాబ్ ధరించే హక్కును కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. హిజాబ్ నిషేధంపై సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరుగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఓ సభలో ఓవైసీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముస్లిం మహిళలు తలలు కప్పుకోవడం అంటే వారి మనసులను కప్పుకోవడం అని అన్నారు. మా అమ్మాయిలను బెదిరిస్తున్నారని అంటున్నారు.. ఈ రోజుల్లో ఎవరు భయపడుతారని ఆయన అన్నారు. కర్ణాటకలో హిజాబ్ నిషేధంపై ఆయన మాట్లాడుతూ.. ముస్లింలు అధమంగా ఉన్నారని.. ఇతర మతాలకు చెందిన విద్యార్థులకు ఇది సంకేతాలు ఇస్తుందని అన్నారు. ఒక హిందువు, ఒక సిక్కు, క్రిస్టియన్ విద్యార్థిని వారి మతపరమైన సంకేతాలతో తరగతిలోకి ప్రవేశించడానికి అనుమతించినప్పుడు, ఒక ముస్లిం విద్యార్థిని ఆపేసినప్పుడు.. మిగతా వారు ముస్లింలు తమ కంటే దిగువన ఉన్నారని అనుకుంటారని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
Read Also: Solar Energy Cloth : స్మార్ట్ ఫోన్లకు షర్ట్ తోనే చార్జింగ్ పెట్టేయొచ్చు.. అద్భుత ఆవిష్కరణ
హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ ఏదో ఒక రోజు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆయన అన్నారు. నేను ఇంతకు ముందే ఈ విషయాన్ని చెప్పాను.. మళ్లీ చెబుతున్నానని.. నా జీవితంలో కాకపోతే నా తర్వాత అయిన హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ ప్రధాని అవుతుందని అన్నారు. ఇది నా కల అని.. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ సవాల్ విసురుతూ.. ముస్లిం బాలికలు తమ ఇష్టప్రకారం హిజాబ్ ధరించి ఉంటారని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధులియా తీర్పును ఉటంకిస్తూ.. ముస్లిం బాలికలు ఇంట్లో, బయట హిజాబ్ ధరించినట్లయితే, తరగతి గదుల్లో ఎందుకు ధరించకూడదని అది వారి గౌరవానికి సంబంధించిన విషయమని అన్నారని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ముస్లిం బాలికలు తమక నచ్చిన విధంగా దస్తులు ధరించే హక్కును కలిగి ఉంటారని నొక్క చెప్పారు.
जिस भारत की आज़ादी के लिए हमारे बुजुर्गों ने अपने जानों की कुर्बानी दी थी आज उसी भारत में हमारे बेटियों से कहा जा रहा है कि हिजाब क्यों पहनते हो?https://t.co/T7b6o5PvkQ
— Asaduddin Owaisi (@asadowaisi) October 14, 2022
