కేంద్ర ప్రభుత్వం రెండు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వందేభారత్‌కు స్లీపర్ వెర్షన్‌గా వస్తున్న ఈ హైస్పీడ్ రైళ్లను అమ్రిత్ ఎక్స్‌ప్రెస్‌గా లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే వీటి ప్రారంభోత్సవానికి రంగం అంతా సిద్ధమైంది. రేపు డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లను అయోధ్యలో రేపు లాంచనంగా ఈ రైళ్లను ప్రారంభించననున్నారు. ఇందులో ఒకటి యూపీలోని అయోధ్య నుంచి బిహార్‌లోని దర్భంగా వరకు సేవలు ప్రయాణిస్తుండగా.. రెండవది పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా-బెంగళూరు వరకు ఏపీ మీదుగా ప్రయాణుకులకు సేవలు అందించనుంది. ఈ అమ్రిత్ భారత్ రైళ్లను ప్రత్యేక సదుపాయాలతో ప్రవేశపెడుతున్నారు.
ఇవి గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించనున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఈరైళ్లను తీసుకువచ్చినట్టు యూనియన్ రైల్లే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైళ్లలో ‘పుష్-పుల్’ వంటి అడ్వా్న్డ్స్ టెక్నాలజీని కలిగి ఉందని, ఇది రైళ్ల వేగాన్ని, ప్రయాణీకుల సౌకర్యాన్ని గణనీయంగా పెంచుతుందని చెప్పారు. ఈ అమ్రిత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎల్‌ఈడీ లైట్లు, సీసీటీవీలు,పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టిమ్ వంటి ఇరత సౌకర్యాలు కలిగి ఉన్నాయి. రేపు అయోధ్యలో ప్రదానీ జెండా ఊపీ రైళ్లను ప్రారంభించననున్నారు. అనంతరం టెస్ట్ కోసం 4, 5 నెలల పాటు టెస్ట్ రన్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
Also Read: Chitradurga shocker: ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు.. అసలేం జరిగిందంటే?