Site icon NTV Telugu

Tamilnadu: సీఎం స్టాలిన్‌పై పరువునష్టం దావా.. తాత్కాలిక స్టే విధించిన హైకోర్టు

Stalin

Stalin

తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఆయన అల్లుడు శబరీశన్‌పై మాజీ డిప్యూటీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్‌ వేసిన పరువు నష్టం కేసు విచారణపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి ప్రాంతంలో మహిళలను, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసి, వీడియోలను తీసి బెదిరించిన ఘటనల్లో జయరామన్ కు సంబంధాలు ఉన్నాయంటూ సీఎం స్టాలిన్, శబరీశన్ విమర్శించినట్టు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగించారంటూ మాజీ డిప్యూటీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్ పరువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తుల బెంచ్ తాత్కాలికంగా స్టే విధించింది. తదుపరి విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన నీట్‌ వ్యతిరేక బిల్లును గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆరోపించారు. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి ఆయన బిల్లును ఢిల్లీకి పంపాల్సి ఉందని, అయితే అలా చేయకపోవడం సరికాదని, సభా గౌరవానికి కూడా భంగం వాటిల్లినట్టేనని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.

COVID 19: భారత్‌లో మళ్లీ తగ్గిన కరోనా కేసులు

Exit mobile version