Site icon NTV Telugu

IND vs PAK: మళ్లీ కాల్పులకు తెగబడిన పాకిస్తాన్.. గట్టిగా బుద్ధి చెప్తున్న భారత్..

Ind

Ind

IND vs PAK: భారత్- పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు చీకటి పడగానే డ్రోన్లతో దాడికి దాయాది దేశం ప్రయత్నించింది. యూరీ, కుప్వారా, పూంచ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరుపుతుంది. దీంతో జై సల్మేర్, యూరీ ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. రంగంలోకి దిగిన భారత భద్రతా దళాలు పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొడుతుంది.

Read Also: 24 Airports Closed: భారత్-పాకిస్తాన్ మధ్య హై టెన్షన్.. 24 ఎయిర్పోర్టులు బంద్

అయితే, పాకిస్తాన్ కాల్పులకు దిగడంతో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. ఇక, సాంబ సెక్టార్, జమ్మూ, పఠాన్ కోట్, పోఖ్రాన్ లో మరోసారి డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేసింది. పాక్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లోని 24 ఎయిర్ పోర్టులను కూడా కేంద్రం మూసివేసింది. ఈ నెల 15వ తేదీ వరకు మూసివేసి ఉంటాయని స్పష్టం చేసింది.

మరోవైపు, జమ్మూ కశ్మీర్ లో కాల్పుల మోత కొనసాగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. తమకు కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ లో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సీఎం సూచనలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్ పూర్తిగా బ్లాకౌట్ అయిందన్నారు.

Exit mobile version