NTV Telugu Site icon

Donald Trump: ‘‘మోడీ అద్భుతమైన వ్యక్తి’’.. పాకిస్తాన్‌కి ధమ్కీ ఇచ్చిన విషయాన్ని చెప్పిన ట్రంప్..

Modi, Trump

Modi, Trump

Donald Trump: మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ల తరుపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమెక్రాట్ల తరుపున ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ యూఎస్ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య పోరు ఎంతో రసవత్తరంగా ఉంది. ఇదిలా ఉంటే, అమెరికా ఎన్నికల్లో ఇండియా ఫ్యాక్టర్ కీలకంగా ఉంది. అమెరికాలో చాలా మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారాయి. భాతర సంతతి ప్రజల్ని ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. 2019లో తాను ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో హూస్టల్‌లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ సభపై మాట్లాడారు. కమిడియన్స్ ఆండ్రూ షుల్ట్జ్, ఆకాష్ సింగ్‌తో కలిసి ‘‘ఫ్లాగ్రాంట్’’ పోడ్‌కాస్టులో ట్రంప్ పాల్గొన్నారు. ఈ భేటీలో పీఎం మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ బయటకు శాంతంగా, తండ్రిలా కనిపిస్తారు కానీ, ఆయన కఠినంగా ఉండే మంచి వ్యక్తి అని అభివర్ణించారు.

Read Also: Hyderabad: క్యాబ్‌డ్రైవర్‌కి డిజిటల్ పేమెంట్ చేసిన మహిళ.. ఆమెను ట్రాప్‌చేసి గోవా తీసుకెళ్లి…

మోడీ తనకు ఎంతో మంచి మిత్రుడని, తమ మధ్య సంబంధాలు చాలా బాగుంటాయని చెప్పారు. 80,000 మంది ప్రజలు హౌడీ మోడీ సభకు హజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అందేంతో క్రేజీగా ఉందని మోడీ, తాను(ట్రంప్) ఇద్దరు ప్రజలకు అభివాదం చేస్తూ సభలో నడిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

అయితే, తాను మోడీతో భారత్‌కి పాకిస్తాన్‌తో ప్రమాదం ఉందని, నేను వారితో వ్యవహరింగలనని ప్రధాని మోడీకి చెప్పానని ట్రంప్ వెల్లడించారు. ‘‘ భారత్‌ని బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. నేను సాయం చేయగలనని చెప్పాను. వారితో(పాకిస్తాన్)తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పాను. దీనికి మోడీ.. ‘అవసరమైనది చేస్తా’ 100 ఏళ్లుగా మేము వారిని ఓడిస్తున్నాం’’ అని పరోక్షంగా పాకిస్తాన్ గురించి మోడీ చెప్పిన విషయాన్ని ట్రంప్ వెల్లడించారు. 88 నిమిషాల సుదీర్ఘ ఇంటర్వ్యూలో 37 నిమిషాల సంభాషణ మోడీ చూట్టూనే తిరిగింది.