NTV Telugu Site icon

Jharkhand Floor Test: జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో గెలిచిన హేమంత్ సోరెన్ ప్రభుత్వం

Jarjhabd

Jarjhabd

Jharkhand Floor Test: జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇవాళ (సోమవారం) విజయం సాధించింది. అయితే, భూ కుంభకోణంలో బెయిల్ పొంది ఈ వారం ప్రారంభంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ స్వీకరించారు. కాగా, హేమంత్ సోరెన్ యొక్క నేతృత్వంలోని అధికార కూటమిలో ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా — జేఎంఎం- 27, కాంగ్రెస్-17 ఉండగా ఇక, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

Read Also: CM Revanth Reddy: రాహూల్ గాంధీ ప్రధాని కావాలన్నదే వైఎస్ఆర్‌ కోరిక..

అయితే, బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య బలం కూడా 76కి తగ్గిపోయింది. జార్ఖండ్ స్పీకర్ రవీంద్ర నాథ్ మహ్తో విశ్వాస తీర్మానంపై చర్చ కోసం ఒక గంట సమయం కేటాయించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తర్వాత హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. కాగా, ముఖ్యమంత్రి పదవికీ చంపాయ్ సోరెన్ రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత జూలై 4వ తేదీన సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ల్యాండ్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఇటివల బెయిల్ మంజూరు చేయడంతో జూన్ 28వ తేదీన హేమంత్ సోరెన్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్టు చేయడానికి కొద్దిసేపటి ముందు హేమంత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.