Droupadi Murmu: కేరళ పర్యటనలో రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం
- కేరళ పర్యటనలో రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం
- హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కూలిన హెలిప్యాడ్ స్థలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిప్యాడ్ ఉన్న స్థలం ఒక్కసారిగా కుంగిపోయింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై హెలికాప్టర్ కిందకు దిగిపోకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Mamdani-Modi: భారత్‌లో కొంతమందికే చోటుంది.. దీపావళి వేడుకలో మోడీ లక్ష్యంగా న్యూయార్క్ మేయర్ అభ్యర్థి విమర్శలు
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
నాలుగు రోజుల కేరళ పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం తిరువనంతపురం వచ్చారు. రాత్రి రాజ్‌భవన్‌లో బస చేసిన ఆమె ఈ ఉదయం శబరిమల ఆలయ దర్శనానికి బయల్దేరారు. బుధవారం ఉదయం పథనంథిట్టకు వచ్చారు. రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో హెలికాప్టర్ దిగుతుండగా.. హెలిప్యాడ్ ఒక్కసారిగా కుంగిపోయింది. హెలికాప్టర్ చక్రం అందులో ఇరుక్కుపోయింది. భద్రతా సిబ్బంది పైకి లేపేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్ నుంచి కిందకు దించారు. అనంతరం రోడ్డు మార్గంలో పంబకు వెళ్లిపోయారు. ఇక హెలికాప్టర్ చక్రాన్ని బయటకు తీసేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు టీవీ ఛానళ్లలో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాస్తవానికి రాష్ట్రపతి హెలికాప్టర్ పంబ సమీపంలోని నీలక్కల్ దగ్గర దిగాల్సింది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్‌ను మార్చారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
నాలుగు రోజుల పాటు కేరళలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం, శివగిరి సందర్శన, రాజ్‌భవన్‌లో మాజీ రాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ విగ్రహా ఆవిష్కరణ, రెండు కళాశాల్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.
#WATCH | Kerala: A portion of the helipad tarmac sank in after a chopper carrying President Droupdi Murmu landed at Pramadam Stadium. Police and fire department personnel deployed at the spot physically pushed the helicopter out of the sunken spot. pic.twitter.com/QDmf28PqIb
— ANI (@ANI) October 22, 2025
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!