Landslide In Jammu Kashmir: భారీ వర్షాలు జమ్మూకశ్మీర్ ను అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి పెను బీభత్సం సృష్టించాయి. కత్రాలోని ప్రసిద్ధమై వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది అని అధికారులు ఇవాళ (ఆగస్టు 27న) ఉదయం వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను మూసివేసినట్లు ప్రకటించారు.
Read Also: UP: సీఎం యోగి సరికొత్త నిర్ణయం.. 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏం చేశారంటే..!
నిలిచిపోయిన కమ్యూనికేషన్..
అలాగే, భారీ వర్షాలు, వరదలతో 20-30కి పైగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. బ్రిడ్జిలు, మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆకస్మిక వరదలతో ఫోన్, ఇంటర్నెట్ సేవలు దెబ్బతినడంతో లక్షలాది మంది కమ్యూనికేషన్ లేకుండా పోయింది. మరోవైపు, జమ్మూ నగరం, ఆర్.ఎస్.పురా, సాంబా, అఖ్నూర్, నాగ్రోటా, కోట్ భల్వాల్, బిష్ణా, విజయ్‌పూర్, పుర్మండల్, కఠువా, ఉధంపూర్‌లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెయాసి, రాంబన్, దోఢా, బిళ్లవార్, కత్రా, రామ్నగర్, హిరానగర్, గూల్, బనిహాల్‌లో తక్కువ మోతాదులో వర్షం కురుస్తోంది.
Read Also: H-1B Impact On Indians: H-1B వీసాలు, గ్రీన్ కార్డ్ వ్యవస్థలో మార్పులు.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
పాఠశాలలకు సెలవులు..
ఇక, జమ్మూ కశ్మీర్ లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటినీ ఇవాళ (ఆగస్టు 27న) మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 10వ, 11వ తరగతుల పరీక్షలను కూడా జమ్మూ అండ్ కశ్మీర్ బోర్డు వాయిదా వేసింది. అలాగే, భారీ వర్షాల కారణంగా ఉత్తర రైల్వే 22 రైళ్లను రద్దు చేయగా.. 27 రైళ్లను ఫిరోజ్‌పూర్, మాండా, చక్ రఖ్వాలాన్, పఠాన్‌కోట్ స్టేషన్ల వద్ద ఆపేసింది. పఠాన్‌కోట్- కండ్రోరి (హిమాచల్ ప్రదేశ్) మధ్య రైలు సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇక, కత్రా- శ్రీనగర్ రూట్‌లో రైళ్లు నడుస్తున్నాయి.
