NTV Telugu Site icon

భారీ వ‌ర్షాలు… అక్క‌డ రెడ్ అల‌ర్ట్..

Cyclone Tauktae

ఓవైపు క‌రోనా పంజా విసురుతుంటే.. మ‌రోవైపు.. తుఫాన్… కేర‌ళ‌ను వెంటాడుతోంది… అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను తీవ్రరూపం దాల్చ‌డంతో.. కేరళలో శనివారం ఉదయం నుంచి కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి… రాష్ట్రంలోని మలప్పురం, కోజికోడ్‌, కన్నూర్‌, వయనాడ్‌, కాసర్‌గోడ్‌తో సహా ప‌లు జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షాపాతం న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తోంది ఐఎండీ. దీంతో.. రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్‌ల్లో ఆరెంజ్‌ అలర్ట్‌, తిరువనంతపురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.. ఇక‌, లోతట్టు, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు అధికారులు… ఈ తౌక్టే తుఫాన్‌ ఈ నెల 17, 18 తేదీల‌ మధ్య తీరం దాటుందని భావిస్తుండగా.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌. మ‌రోవైపు.. ఎన్‌డీఆర్‌ బృందాలను సిద్ధం చేస్తున్నారు.. మ‌రోవైపు.. కేర‌ళ‌లో కోవిడ్ ప్రోటోకాల్స్ అమలులో ఉన్నందున.. ప్రస్తుతం సహాయ శిబిరాలు ఏర్పాటు స‌వాల్‌గా మారిపోయింది.. పున‌రావాస కేంద్రాల‌తో మ‌హ‌మ్మారి మ‌రింత వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు అధికారులు.