ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం జలమయం అయింది. రహదారులు చెరువులను తలపించడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇక పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో ఘోరం.. కారు ఢీకొని కేంద్ర ఆర్థిక శాఖ అధికారి దుర్మరణం
ఇక రాబోయే 3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే థానే, రాయ్‌గడ్, బీడ్, అహల్యానగర్, పూణె, లాతూర్‌లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక భారీ వర్షాలు కారణంగా ముంబైలో అంతరాయాలు ఏర్పడతాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ రోజంతా ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావొద్దని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలలో వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ప్రజలు అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Jharkhand: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోల హతం.. ఒకరిపై రూ.కోటి రివార్డ్
ఇక ముంబైలో ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి సోమవారం ఉదయం 5:30 గంటల వరకు వేర్వేరు ప్రాంతాల్లో భారీగానే వర్షపాతం నమోదైందని వెల్లడించింది. కొలాబాలో అత్యధికంగా 88.2 మి.మీ, బాంద్రాలో 82 మి.మీ, బైకుల్లాలో 73 మి.మీ, టాటా పవర్ స్టేషన్‌లో 70.5 మి.మీ నమోదయ్యాయి. జుహులో 45 మి.మీ, శాంటాక్రూజ్, మహాలక్ష్మి స్టేషన్లలో వరుసగా 36.6 మి.మీ, 36.5 మి.మీ నమోదయ్యాయి. ఇక పూణె శివారు ప్రాంతాల్లోని పాఠశాలలకు.. కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
#WATCH | Maharashtra: Heavy rainfall in Navi Mumbai causes waterlogging in parts of the city. pic.twitter.com/N59Zpx0ALT
— ANI (@ANI) September 15, 2025
