Site icon NTV Telugu

Tamilnadu Rain: భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం.. రెడ్ అలర్ట్ జారీ

Tamilnadurain

Tamilnadurain

భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక చెన్నైలో ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది. అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు.

ఇది కూడా చదవండి: Off The Record : ఎమ్మెల్యే కొలికపూడి అన్నిటికి తెగించేసారా..?

ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కావడంతో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల్లో దాదాపు 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలదుత్తురై జిల్లాల్లో బుధవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక తీరప్రాంత జిల్లాలైన విల్లుపురం, కడలూరు, మైలదుత్తురై, నాగపట్నం, తిరువళ్లూరు, తంజావూరు, పుదుక్కోట్టై, రామనాథపురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో స్కూళ్లు, కళాశాలకు సెలవులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: KTR : పార్టీ మారిన ఎమ్మెల్యేల సిగ్గు లేదు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) డైరెక్టర్ బి. అముధ తెలిపారు. ఈ అల్పపీడనం చెన్నై తీరం నుంచి దాదాపు 400 కి.మీ దూరంలో ఉందని.. ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని అముధ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. దీంతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అముధ చెప్పారు.

ఇది కూడా చదవండి: Bihar Elections 2025: బీహార్ సమరానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

 

Exit mobile version