Site icon NTV Telugu

Gujarat Rain: గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. స్కూళ్లకు సెలవులు

Gujaratrain

Gujaratrain

గుజరాత్‌లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక సూరత్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. భద్రతా దృష్ట్యా జిల్లా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Phone Tapping : కొత్త మలుపు.. మాజీ సీఎస్ శాంతికుమారి స్టేట్మెంట్ రికార్డ్

భారీ వరదలు కారణంగా విద్యార్థులను బయటకు రానివ్వొద్దని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. 24 గంటల్లో దాదాపు 6 అంగుళాల వర్షం కురిసినట్లుగా ఐఎండీ పేర్కొంది. సూరత్, వల్సాద్, జామ్‌నగర్, జునాగఢ్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అహ్మదాబాద్, రాజ్‌కోట్, గాంధీనగర్, మెహ్సానా వంటి నగరాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అమ్రేలి, భావ్‌నగర్, నవ్‌సరి, వడోదర వంటి అదనపు జిల్లాల్లో కూడా ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Assembly Bypoll Result 2025: గుజరాత్‌లో ఆప్, కేరళలో కాంగ్రెస్ విజయం

ఇక లోతట్టు ప్రాంతాల నివాసితులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు కోరారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజా రవాణా సౌకర్యం దెబ్బతింది. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున పౌరులు భద్రతా మార్గదర్శకాలను పాటించాలని అధికారులు కోరారు.

 

Exit mobile version