Site icon NTV Telugu

Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. భారీగా ట్రాఫిక్ జామ్.. విమాన రాకపోకలకు అంతరాయం

Delhirain

Delhirain

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వానకు నగరం అతలాకుతలం అయింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్ని ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మోకాలి లోతు నీటితో రహదారులు నిండిపోయాయి. ఇక విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక గురు, శుక్రవారాల్లో భారీగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇది కూడా చదవండి: Betting Apps Case : రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు నమోదు..

బుధవారం సాయంత్రం నుంచే ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం వరకు భారీగా వర్షం కురిసింది. దీంతో నగర వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి. గురువారం ఉదయమే ఉద్యోగాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇక విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఢిల్లీ ఎయిర్‌పోర్టు తెలిపింది.

ఇది కూడా చదవండి: Chiru157 : మెగా – అనిల్ నాన్ – థియేట్రికల్ రికవరి కాస్త రిస్కే

ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ ఉండగా ప్రస్తుతం దాన్ని ఐఎండీ రెడ్ అలర్ట్‌గా మార్చింది. నిన్నటి నుంచి ఏకధాటిగా వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. నజాఫ్‌గఢ్‌లో 60 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం కూడా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది. ఇక గురుగ్రామ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెహ్రూ ప్లేస్, అరబిందో మార్గ్, లజ్‌పత్ నగర్ వంటి ప్రాంతాల్లో కూడా తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక గురుగ్రామ్‌లో అయితే చాలా అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు ప్రవేశించాయి. ఈ మేరకు బాధితులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Exit mobile version