దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. అర్ధరాత్రి నుంచి కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. నోయిడా, గురుగ్రామ్‌లో భారీ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షాలు కారణంగా 90 విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. నాలుగు విమానాలు రద్దయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం భారీ వర్షాలు కురుస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ ఫిక్స్.. ఎప్పుడంటే..!
ఇక విమానాశ్రయానికి బయల్దేరే ముందు ప్రయాణికులు విమాన సంస్థలను సంప్రదించాలని ఎయిర్‌పోర్టు సంస్థ తెలిపింది. విమానాశ్రయానికి బయలుదేరే వెబ్‌సైట్ లేదా యాప్‌లో విమాన స్థితిని తెలుసుకోవాలని ఇండిగో వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Prostitution Racket: భారత్ చూపిస్తామంటూ బంగ్లాదేశీ మైనర్ అమ్మాయిని వ్యభిచారంలోకి నెట్టిన స్నేహితురాలు!
శనివారం రక్షా బంధన్ కావడంతో రహదారులు రద్దీగా మారాయి. మహిళలు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు బయటకు వస్తున్నారు. దీంతో రహదారులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
#WATCH | Delhi | Heavy rain causes waterlogging at the Panchkuian Marg pic.twitter.com/nldjJHoqhI
— ANI (@ANI) August 9, 2025
