Site icon NTV Telugu

Delhi Rain: ఢిల్లీలో వర్ష బీభత్సం.. నలుగురు మృతి

Delhirain2

Delhirain2

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున సృష్టించిన దుమ్ము తుఫాన్, భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. ఇక భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు నేలకొరిగాయి. నజాఫ్‌గఢ్‌లో భారీ చెట్టు కూలడంతో నలుగురు చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. 26 ఏళ్ల జ్యోతి అనే వివాహితతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. భర్త అజయ్‌ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: భారత్‌లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!

ఇక విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి కూడా నీళ్లు వచ్చేశాయి. దాదాపు 100కి పైగా విమానాలు ఆలస్యం కానున్నట్లు విమాన సంస్థలు హెచ్చరించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనెక్టివిటీ విమాన ప్రయాణికులు మాత్రం మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన రెండు విమానాలను జైపూర్‌కు, ఒక విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించినట్లు అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Akkineni : శోభితా అక్కినేని.. చీర కట్టులో ఎంత చక్కగా.. ముద్దుగా ఉందో..

ఇక ఢిల్లీలోని ద్వారక, ఖాన్‌పూర్, సౌత్ ఎక్స్‌టెన్షన్ రింగ్ రోడ్, మింటో రోడ్, లజ్‌పత్ నగర్ మరియు మోతీ బాగ్ వంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఇక భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోయాయి. కొన్ని కొమ్మలు రహదారులపై పడిపోయాయి. అయితే అధికారులు నష్టాన్ని అంచనా వేయలేదు. వీలైనంత వరకు ప్రజల్లో ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.

ఇక భారత వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం వరకు తీవ్రమైన ఉరుములు, ఈదురుగాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అసవరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు.

 

 

Exit mobile version