KCR Petition: నేడు సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ.. సర్వత్రా ఆసక్తి
- విద్యుత్ కమిషన్‌పై సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్..
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని పిటిషన్..
- దీనిపై నేడు విచారణ చేపట్టనున్న సీజేఐ ధర్మాసనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Petition: విద్యుత్ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ గతంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు కమిషన్ ఏర్పాటును చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. దానిని హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ప్రక్రియ, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణం తదితరాలను విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్.. కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించింది.
Read also: EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న స్పెయిన్
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ఇక విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. తనను విచారణకు పిలవవద్దని కోరుతూ కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. హైకోర్టు తీర్పును గులాబీ బాస్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు నేడు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. గత బీఆర్‌ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని రేవంత్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. విచారణలో భాగంగా కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే నరసింహారెడ్డి తీరును కేసీఆర్ తప్పుబట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ వివరాలను మీడియా ముందు వెల్లడించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. కమిషన్‌కు రాజీనామా చేయాలని జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న స్పెయిన్
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!