NTV Telugu Site icon

KCR Petition: నేడు సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ.. సర్వత్రా ఆసక్తి

Kcr

Kcr

KCR Petition: విద్యుత్‌ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై నేడు సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ గతంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు కమిషన్‌ ఏర్పాటును చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కేసీఆర్‌ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. దానిని హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ప్రక్రియ, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణం తదితరాలను విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్.. కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించింది.

Read also: EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న స్పెయిన్

ఇక విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. తనను విచారణకు పిలవవద్దని కోరుతూ కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. హైకోర్టు తీర్పును గులాబీ బాస్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు నేడు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. గత బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యుత్‌ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని రేవంత్‌ ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్‌ వేసింది. విచారణలో భాగంగా కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే నరసింహారెడ్డి తీరును కేసీఆర్ తప్పుబట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ వివరాలను మీడియా ముందు వెల్లడించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. కమిషన్‌కు రాజీనామా చేయాలని జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న స్పెయిన్